పూటకో కోడిని తినే హీరోయిన్ ఉందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ, ఇండస్ట్రీలో వినిపించే మాట నిజంగా ఓ సీనియర్ హీరోయిన్ తాను తినే లంచ్ గానీ, డిన్నర్ లో గానీ ఫుల్ కోడి కావాల్సిందేనట. ఆ హీరోయిన్ మరెవరో కాదు బొద్దుగా ముద్దుగా ఉండే మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న మీనా ఆ తర్వాత హీరోయిన్గా కూడా మంచి స్టార్ డం ని సంపాదించుకుంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ముత్తు లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించింది.
మలయాళంలో మోహన్ లాల్ లాంటి స్టార్ తో జత కట్టింది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ లాంటి వారితో రొమాన్స్ చేసింది. ఒకదశలో మీనా లేకుండా తెలుగులో సినిమా ఉండేది కాదు. అందాల ఆరబోతతో అందరి హృదయాలను పిండేసింది. మీనా అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆమె బొడ్డు, కళ్ళు. ఈ రెండు మీనాలో సెక్స్ అపీల్స్ అని చెప్పాలి. చీర కట్టినా, మోడ్రన్ డ్రస్ వేసినా మీనా బొడ్డు చూపించడానికి దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపించారు.
ఇటీవల ఆమె భర్త చనిపోయారు. కాస్త బ్రేక్ తీసుకున్న మీనా మళ్ళీ సినిమాలలో నటిస్తోంది. సక్సెస్ ఫుల్ సిరీస్ అయిన దృశ్యం మీనాకి సీనియర్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో వచ్చిన రెండు భాగాలు ఆమె లేకుండా ఇంకో హీరోయిన్ ని ఊహించుకోవడం కష్టమే. ఇప్పటికీ తరగని అందం మీనా సొంతం. ఇంత అందగంగా ఉండటానికి ముఖ్య కారణం మీనా డైట్ అని చెప్పాలి. ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకునే ఈ గ్లామరస్ బ్యూటీ క్రమం తప్పకుండా చికెన్ మాత్రం తన ఫుడ్ లో ఉండేలా చూసుకుంటుందట.
మధ్యాహ్నం, రాత్రికి డిన్నర్ లో మీనా ఒక కోడిని మొత్తాన్ని తింటుందని టాక్ వినిపిస్తుంది. మధ్యాహ్నం రోటీ గ్రిల్డ్ చికెన్ తింటుందట. ఒక కోడి మొత్తం అవలీలగా తినే అలవాటుందని సమాచారం. అలాగే నైట్ డిన్నర్ లోనూ చికెన్ తప్పనిసరి అట. షూటింగ్ ఉన్నన్ని రోజులు ఇదే ఫాలో అవుతుందట. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మీనా అడిగ ఫుడ్ అరేంజ్ చేస్తారని చెప్పుకుంటుంటారు. ఒక్క మీనా విషయంలోనే కాదు, చాలామంది హీరోయిన్స్ ఫుడ్ విషయంలో నిర్మాతకి చుక్కలు చూపిస్తుంటారట. ముంబైలో స్ట్రీట్ ఫుడ్ తినేవారు కూడా ఇక్కడకొచ్చి నిర్మాతకి ఆముదం రాస్తున్నారని కొందరు సీనియర్ మేకర్స్ చెప్తున్నారు.