టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆరడుగుల అందగాడు ప్రభాస్ . ఇతగాడు పెళ్లి చేసుకుంటాడో..? లేదో..? తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈయన పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే ప్రభాస్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న హీరో మాత్రం రామ్ పోతినేని అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో స్కంద సినిమాతో మిక్స్డ్ టాక్ అందుకున్నాడు.
అయితే ఈ హీరో పెళ్లి వయసు వచ్చిన ఇప్పటివరకు పెళ్లి ఆలోచన చేయలేదు. అంతేకాదు పెళ్లిపై ఎక్కడా కూడా అఫీషియల్ గా స్పందించలేదు . కానీ రామ్ మాత్రం ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ ను ప్రేమిస్తున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి . అది కూడా మలయాళీ బ్యూటీ . ఎస్ అనుపమ పరమేశ్వరన్ తో రామ్ పోతినేని ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి .
మరోపక్క అనుపమ పరమేశ్వరన్ సైతం తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తుంది . దీంతో రాంపోతినేని – అనుపమ పరమేశ్వరన్ ప్రేమాయణం నడుపుతున్నారు అన్న న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు తెరపై కూడా వీళ్ళ జోడి బాగా మెప్పించడంతో రియల్ లైఫ్ లో కూడా జంట బాగుంటుంది అని.. పెళ్లి చేసుకుంటే మరింత బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి దీనిపై మరి రాం పోతినేని ఎలా స్పందిస్తాడో..?