టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ పై కూడా కన్నేసింది . దేవర సినిమాతో టాలీవుడ్లోకి డబ్ల్యూ ఇవ్వబోతున్న జాన్వి కపూర్ మరో తెలుగు సినిమా సైతం ఫిక్స్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వార్తలు తెలుగు మీడియాలో వైరల్ అవుతున్నాయి . నిజానికి జాన్వి కపూర్ చాలా జోవియల్ గా చాలా అల్లరి అల్లరిగా ఉంటుందట . అంతేకాదు ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం నైట్ అవుట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టమట. వారానికి ఓసారి నచ్చిన ఫుడ్ ఇష్టంగా తినేస్తుందట .మిగతా ఆరు రోజులు మాత్రం కఠినంగా డైటింగ్ చేస్తుందట .
అంతేకాదు జాన్వి కపూర్ కి నిద్ర రాకపోతే నైట్ టైమ్స్ టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూస్తుందట . ఖుషి కపూర్ ని ఏడిపించడం జాన్వి కపూర్ కి మహా మహా ఇష్టమట. అంతేకాదు ఇప్పటికీ తన అమ్మ శ్రీదేవి తనతోనే ఉంది అంటూ ఫీల్ అవుతూ నైట్ పడుకునే ముందు గుడ్ నైట్.. నిద్ర లేచాక గుడ్ మార్నింగ్ చెప్తుందట . ఇది నిజంగా జాన్వికపూర్ కు శ్రీదేవి పై ఉన్న ప్రేమను ప్రూవ్ చేయడమే అంటున్నారు ఫ్యాన్స్..!!