సినిమా రంగంలో హీరోలకు 60 ఏళ్లు 70 ఏళ్ళు వచ్చిన తమదైన మార్కెట్‌తో దూసుకుపోతూ ఉంటారు. సినిమా హీరోలు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా.. వారి పిల్లలకు పెళ్లి చేసిన కూడా సినిమా ఛాన్స్‌లు వస్తూ ఉంటాయి. అయితే హీరోయిన్లకు అలా ఉండదు. వాళ్లు 40 ఏళ్లు కూడా సినిమా రంగంలో ఉండలేరు. ఒకవేళ ఉన్న వాళ్లకు హీరోయిన్ రోల్స్ రావు.. సపోర్టింగ్ రోల్స్ లోను నటించేందుకు సిద్ధంగా ఉండాలి. లేదా అత్తగాను, అమ్మగాను ఆంటీ పాత్రలో వేసుకుంటూ కాలం వెళ్లదీయాలి.
కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉన్నారు. త్రిష, నయనతార, అనుష్క లాంటి నటీమణులను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. త్రిష, నయనతార 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనేక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలలో స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఒక్కో సినిమాకు రూ.8 నుంచి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
దక్షిణ భారతదేశ సినిమా పరిశ్రమలో ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోయిన్‌గా నయనతారకు మంచి గుర్తింపు ఉంది. సౌత్ ఇండియాలో ఇప్పుడు నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరొకరు లేరు. ఆమె తర్వాత స్థానంలో మరో కోలీవుడ్ హీరోయిన్ త్రిష ఉంది. ఆమె కూడా ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు 40 ఏళ్లు దాటిన ఇంకా కుర్ర అమ్మాయిలా కనిపిస్తోంది.
తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఆమెకు రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో అనుష్క శెట్టి ఉంది. ఈమె ఒక్కో సినిమాకు రూ.5 నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటుంది. ఇక సమంత కూడా ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల తర్వాత ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ లోనటిస్తోంది.
ఇక పూజ హెగ్డే కూడా ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రష్మిక, శ్రీలీల మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. జైలర్ ద్వారా తిరిగి పాపులర్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా మూడు కోట్ల వరకు వసూలు చేస్తోంది. కాజల్ అగర్వాల్ ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు కోటిన్నర, కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు రెండున్నర కోట్లు తీసుకుంటున్నారు.