తాజాగా యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ – బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. బోయపాటి బాలయ్యతో ఎక్కించిన అఖండ సినిమా తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా స్కంద. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు తమన్. అఖండ సినిమా టైంలో ఆ సినిమాకు తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం తెలుగు ప్రేక్షకులకు ధియేటర్లలో పూనకాలు తెప్పించేసింది.
క్రేజీ మ్యూజిక్ ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా చూస్తున్న ప్రేక్షకులను మామూలుగా ఊపేయ్యలేదు. అనకాపల్లి నుంచి అమెరికా వరకు థియేటర్లలో స్పీకర్లు బద్దలైపోయాయి. అమెరికాలో కొన్ని థియేటర్లలో తాము సౌండ్ తగ్గిస్తున్నామని.. మ్యూజిక్ దెబ్బతో స్పీకర్లు పగిలిపోతున్నాయంటూ థియేటర్ యాజమాన్యం కూడా బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. అంతలా తన మ్యూజిక్‌తో తమన్ ఊపేశాడు.
ఇప్పుడు సేమ్ సీన్ స్కంద సినిమా విషయంలోనూ రిపీట్ అయింది. చాలా థియేటర్లలో నార్మల్‌గా పెట్టే సౌండ్ పెట్టినా కూడా తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి సౌండ్ స్పీకర్లు సరిగా పనిచేయటం లేదన్న కంప్లైంట్ లో వస్తున్నాయి. నిన్న ఆంధ్రతో పాటు తెలంగాణలోని పలు థియేటర్లలో ఇదే పరిస్థితి.
దీంతో అక్కడ థియేటర్లో యాజమాన్యాలు కూడా సౌండ్ బాగా తగ్గించేస్తున్నారు. దీంతో మ్యూజిక్ పరంగా మళ్ళీ తమన్ మరోసారి అఖండ తరహాలోనే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడని చెప్పాలి. అయితే స్కంద సినిమా విషయంలో పాటలు క్యాచీగా లేవని కంప్లైంట్ లు వచ్చినా నేపథ్య సంగీతంతో మాత్రం అదరగొట్టేసాడు.