Newsఎన్టీఆర్ - ప్రియ‌మ‌ణి అప్ప‌ట్లో అలా... ఇప్పుడిలా.. స‌రికొత్త రూమ‌ర్‌...!

ఎన్టీఆర్ – ప్రియ‌మ‌ణి అప్ప‌ట్లో అలా… ఇప్పుడిలా.. స‌రికొత్త రూమ‌ర్‌…!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది ప్రియ‌మణి. ఆమె స్వతహాగా కన్నడ అమ్మాయి అయినా ఆమెకు తెలుగులోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ప్రియమణి పేరు చెప్పగానే తెలుగువారికి మొదటగా గుర్తుకు వచ్చే సినిమా యమదొంగ. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా ఆమె అమాయకంగా తరదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది.

ప్రియమ‌ణి వ్యక్తిగత జీవితంలోనే కాకుండా సినిమాల విషయంలో కూడా అనేక పుకార్లు, షికార్లు చేస్తూనే ఉంటాయి. తాజాగా ప్రియమణి విషయంలో వచ్చిన పుకారు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాగా దేవర తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర వినయం చేస్తున్నా.రు అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

తండ్రి పాత్రలో నటించే ఎన్టీఆర్‌కు జోడిగా ప్రియ‌మ‌ణి నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఎన్టీఆర్ అభిమానులు కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యమదొంగ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించిన ప్రియమణి ఇప్పుడు దేవరలో తల్లిగా నటిస్తే ఎంతవరకు ? సెట్ అవుతుంది అంటూ కొరటాల మరో హీరోయిన్ ఎంపిక చేయాలని కోరుతున్నారు.

దీనిపై సినిమా నిర్మాతలు ఎలాంటి అధికారిక‌ ప్రకటన ఇవ్వలేదు. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో కూడా ప్రియమ‌ణి కీలకపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా ప్రియమణి బాలీవుడ్ కి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించి అందరిని మెప్పించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news