టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా ఇలియానా హీరోయిన్గా నటించింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మహేష్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా పోకిరిని తెరకెక్కించారు. మహేష్ బాబు యాక్టింగ్ తో పాటు మహేష్ బాబు చెప్పిన డైలాగులు ట్రెండ్ సెట్ చేశాయి.
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు లాంటి పంచ్‌లు ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ హిట్ సినిమాగా నిలబెట్టాయి. మహేష్ బాబు – ఇలియానా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా కొత్తగా ఉండేలా పూరి జగన్నాథ్ డిజైన్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా కంటే ముందు బాలీవుడ్ భామ కంగనా రనౌత్ పేరు పరిశీలించారు. పూరి ముంబై వెళ్లి ఆమెకు కథ చెప్పాడు.
ఆమె సినిమా చేసేందుకు ఓకే కూడా చెప్పింది. అయితే అదే టైంలో ఆమె బాలీవుడ్లో గ్యాంగ్ స్టార్ లవ్ స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ ఒకేసారి జరగడంతో పోకిరి సినిమాకు ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక వదులుకోవాల్సి వచ్చింది. అయితే పోకిరి సినిమాను వదులుకున్నందుకు తన కెరీర్లో తను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటానని తాజాగా కంగనా వెల్లడించారు.
ఆ తర్వాత ఆమె పూరి జగన్నాథ్ సినిమా ఏక్ నిరంజన్తోనే టాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక కంగన తాజాగా నటించిన చంద్రముఖి 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.