నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, క్రేజీ హీరోయిన్ శ్రీలల కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి. ఆరు వరుస సూపర్ డూపర్ హిట్లతో టాలీవుడ్ లో తిరుగేలేని డైరెక్టర్ గా పేరున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేటెస్ట్ మాస్ యాక్షన్ పవర్ఫుల్ ఎంటర్టైనర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రు. 100 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల బాలయ్య సినిమాలకు వరుసగా అదిరిపోయే రేంజ్ లో సంగీతం అందిస్తున్న ఎస్ఎస్ తమన్ భగవంత్ కేసరి సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
అసలు విషయంలోకి వెళితే అప్పుడే భగవంత్ కేసరి బిజిఎం వర్క్ స్టార్ట్ అయింది. సంగీత దర్శకుడు తమన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమన్ పెట్టిన పోస్ట్ చూస్తే బాలయ్య అభిమానులకు పూనకాలు మొదలైపోయాయి. ఈ సినిమా బిజీఎం అఖండను మించిన రేంజ్ లో ఉంటుందని థమన్ హింట్ ఇచ్చేశాడు. అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బిజిఎం ఎంత హైలెట్ ? అయిందో చెప్పక్కర్లేదు.
థియేటర్లలో సినిమా చూస్తుంటే వచ్చిన సంగీతానికి ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. అనకాపల్లి నుంచి అమెరికా వరకు థియేటర్లు సౌండ్ తో దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు కూడా అదే రేంజ్ లో బిజిఎం ఉంటుందని తమన్ హింట్ ఇవ్వడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.