సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం .. అంతా ఓ బూటకం పైకి బాగానే కనిపిస్తున్న లోపల మాత్రం తెలియని ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి . మరోసారి అలాంటిఓ విషయాన్ని బయట పెట్టేసింది రష్మిక మందన్నా. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా రీసెంట్ గా ముఖేష్ అంబానీ ఇచ్చిన గ్రాండ్ వినాయక చవితి ఫెస్టివల్ కు హాజరైంది . మనకు తెలిసిందే ముంబైలో ఉండే ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీని ముఖేష్ అంబానీ వినాయక చవితి సందర్భంగా ఇన్వైట్ చేశారు . ఆ లిస్టులో మన రష్మిక మందన్నా కూడా ఉంది .
అయితే ఇదే క్రమంలో అక్కడికి రష్మిక రాగానే చాలా ట్రెడిషనల్ గా అట్రాక్టివ్ గా కనిపించడంతో అందరూ రష్మిక జీ .. రష్మిక జీ అంటూ ఫోటోలు కోసం ఎగబడ్డారు . అక్కడే ఉండి ఇది చూసిన ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కడుపు రగిలిపోయింది .. అంతే రష్మిక ఫోటోలు దిగే అటువైపుగా వస్తూ శ్రద్ధా కపూర్ ని పలకరించేందుకు ఆగింది . అయితే ఆమె మాత్రం చూసి చూడనట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది . ఇదే విజువల్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి . అయితే రష్మిక కూడా ఆమె ప్రవర్తనకు హార్ట్ అయింది .
కానీ కెమెరాలు ఉన్నాయి అని చూడడంతో సరదాగా నవ్వేస్తూ వెళ్ళిపోయింది . అసలు ఎందుకు శ్రద్ధా కపూర్ రష్మికను పలకరించలేదు అంత కోపంగా ఉంది ..?అని ఆరా తీస్తే.. అనిమల్ సినిమా ఆఫర్ నిజానికి శ్రద్ధా కపూర్ కే రావాలి కానీ రష్మిక మందన్నా ఆఫర్ ని లాగేసుకునింది . అంతేకాదు అంతకుముందు రెండు సినిమాల్లు కూడా అదే విధంగా లాగేసుకునింది . శ్రద్ధా కపూర్ ని హీరోయిన్గా అనుకుంటె ఫైనల్లీ రష్మికను చూస్ చేసుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పర్సనల్ గ్రడ్జ్ పెంచుకున్న శ్రద్ధా కపూర్ రష్మికపై ఇలా రివేంజ్ తీర్చుకునింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!