Moviesఅది ఇష్టం లేకనే జయ సుధ ఫోన్ లాగేసుకున్నాడా..? మోహన్ బాబుది...

అది ఇష్టం లేకనే జయ సుధ ఫోన్ లాగేసుకున్నాడా..? మోహన్ బాబుది మర్యాదనా..? మూర్ఖత్వమా..?

సినిమా ఇండస్ట్రీలో పద్ధతికి మరో మారుపేరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు . ఆయన ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆ పని చేస్తాడు అన్న విషయం చాలామందికి తెలిసిందే. క్రమశిక్షణకు మరో మారుపేరుగా ఇండస్ట్రీలో పిలుచుకుంటూ ఉంటారు . అయితే మోహన్ బాబుకి కూసింత కోపం ఎక్కువే .. ఆయనకు నచ్చనది ఏదైనా జరుగుతుంటే పక్కన ఎవరున్నారని కూడా చూడడు రఫ్ఫాడించేస్తారు.. ఇప్పటికే ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం .

అయితే రీసెంట్గా సహజనటి జయసుధ ఆయన కోపానికి గురైంది.. ఏకంగా అందరి ముందే ఆమె ఫోన్ లాక్కుని ఆమె కసిరించడం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . సహజనటి జయసుధా రీసెంట్గా ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ ఉత్సవానికి హాజరైంది . ఈ క్రమంలోనే అక్కడ ఫోన్ పట్టుకొని ఉన్న జయసుధను చూసిన మోహన్ బాబు వెంటనే ఫోన్ లాక్కొని ఏంటి ..? అంటూ చాలా కోపంగా కసిరారు . దీంతో జయసుధకు కోపం వచ్చినా నవ్వుతూ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కామ్ గా అయిపోయింది .

ఈ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే కావాలనే జయసుధ పై ఇలాంటి కోపాన్ని ప్రదర్శించాడు మోహన్ బాబు అంటూ ప్రచారం జరుగుతుంది . గతంలో జయసుధ మోహన్ బాబును హార్ట్ చేసిందని.. ఆ కారణంగానే ఇప్పుడు అందరి ముందు ఆమె పరువు పోయేలా ఇలా ప్రవర్తించాడు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా మోహన్ బాబు కోప్పడిన నిజానికి అదే నిజం .. అక్కడ అంత మంది మాట్లాడుతున్నప్పుడు జయసుధ ఫోన్ పట్టుకొని ఉండటం ఏంటి ..? అలాంటప్పుడు అసలు ఫంక్షన్ కి రావాల్సిన అవసరం ఏంటి ..? అంటూ జయసుధని జనాలు తిడుతున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news