ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించే మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా హౌస్ లో అంత మంది కంటెస్టెంట్స్ ఉన్న అందరి కాన్సన్ట్రేషన్ తతికపైనే పడింది . కాగా రతిక హౌస్ లో ఓవర్ ఆక్టింగ్ ఎక్కువ చేస్తుందని కావాలని సింపతి గెయిన్ చేస్తుంది అని .. మరీ ముఖ్యంగా రైతు బిడ్డను వాడుకోవాలని చూస్తుంది అని బయట జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఆమె సింపతి గైనింగ్ కోసం మాజీ లవర్ రాహుల్ సిప్లిగంజ్ పేరును మరోసారి వాడుకోవాలని చూస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలోనే తాజాగా ఎపిసోడ్లో రతిక రోజ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మరోసారి ప్రస్తావనకు తీసుకువచ్చి.. బోరున ఏడ్చేసింది . మంగళవారం చూపించిన ఎపిసోడ్లో రతిక ఎమోషనల్ అవుతూ కనిపించిన క్లిప్స్ మనం చూడొచ్చు . దీంతో శివాజీ వచ్చి ఆమె ప్రశ్నిస్తూ ఉండగా..” ఇంట్లో వాళ్ళు అందరూ నా ఎక్స్ గురించే మాట్లాడుతున్నారు ..పదేపదే గుర్తు చేస్తున్నారు “అంటూ నంగనాచి కబుర్లు చెప్పింది .
అయితే ఇదే క్రమంలో శివాజీ కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ..? వాళ్ళకు దీని గురించి ఎవరు చెప్పారు ..? అని అడగ్గా.. నేనే చెప్పా అంటూ షాక్ ఇచ్చింది రతిక . దీంతో షాక్ అయినా శివాజీ “అసలు నీ పర్సనల్ నీ దగ్గర ఉంచుకోకుండా .. వాళ్లకి ఎందుకు చెప్పావు..?” అంటూ తిరిగి కౌంటర్ వేశాడు . దీంతో ఏం చెప్పాలో తెలియక రతిక అడ్డంగా బుక్ అయిపోయింది . అంతేకాదు షో ని చూస్తున్న జనాలు సైతం రతిక డబల్ గేమ్ ఆడుతుందని.. ఎవరిని కావాలో వాళ్ళని వాడుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు..!!