Moviesఆ తెలుగుహీరో వల్లే నా జీవితం ఇలా అయిపోయింది.. బేబీ హీరో...

ఆ తెలుగుహీరో వల్లే నా జీవితం ఇలా అయిపోయింది.. బేబీ హీరో సంచలన కామెంట్స్..!!

విరాజ్ అశ్విన్.. ఈ పేరుకి ఒకప్పుడు అంటే పరిచయాలు చేయాల్సిన అవసరం ఉండేది ..కానీ ఇప్పుడు ఆ పనే లేకుండా పోయింది . బేబీ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన వీరాజ్ అశ్విన్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు . మరీ ముఖ్యంగా గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు బేబీ సినిమాతో వచ్చేసింది. బేబీ సినిమాలో ఆయన బోల్డ్ పర్ఫామెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . బేబీ పాత్రలో నటించిన వైష్ణవి చైతన్య తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు .

కాగా రీసెంట్గా విరాజ్ అశ్విన్ ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు . రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కారణంగానే నన్ను ట్రోల్స్ చేశారు అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ..”ఇండస్ట్రీ లోకి రావాలి అని అనుకుంటున్న కొత్తలో ఒక డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లాను అని ..అది అల్లు అర్జున్ గారు ప్రాక్టీస్ చేసే షెడ్ అని కూడా తెలిసింది ..ఆ డాన్స్ మాస్టర్ నాతో చెబుతూ విరాజ్ ఇక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చి ఎంతలా కష్టపడేవాడో తెలుసా..? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంతో ఎంతో ప్రాక్టీస్ చేసేవాడు ..కష్టపడ్డాడు.. అందుకే ఆ స్థాయికి వెళ్ళాడు అంటూ చెప్పుకొచ్చారు”.

“ఇదే విషయాన్ని బేబీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ కి చెప్పుకొచ్చారట వీరాజ్ . అయితే స్టేజ్ పైకి ఎక్కిన అల్లు అర్జున్ కేవలం హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు మనలో ఏ టాలెంట్ ఉందో మనమే గుర్తించాలి అంటూ ఫుల్ ఫోకస్ పెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు . దీంతో అప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు జనాలు . విరాజ్ యాక్షన్ కి అల్లు అర్జున్ రియాక్షన్ అంటూ దారుణంగా కౌంటర్స్ వేశారు అని..ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు విరాజ్ అశ్విన్ . నేను మాట్లాడిన దాంతో తప్పులేదు కానీ నన్ను ఎందుకు ట్రోల్ చేశారో తెలియదు.. దిన్నంతటికీ కారణం అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలే అంటూ ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news