మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలోని చిర్రావూరులో జన్మించిన సావిత్రి తెలుగు- తమిళ ప్రేక్షకులు ఆరాధించే హీరోయిన్‌గా ఎదిగారు. అప్పట్లో సావిత్రి అంటే ఒక గొప్ప నటి.. కేవలం ఆమె కోసమే థియేటర్లకు క్యూ కట్టే ప్రేక్షకులు ఉండేవారు. ఆమెను చూసేందుకు ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెల నుంచి రైలు ఎక్కి మద్రాస్ కు వెళ్లేవారంటే అతియో శక్తి కాదు.
అలా తనను చూడటానికి వచ్చిన వారందరికీ సావిత్రి తన ఇంటి దగ్గర భోజనం పెట్టి మరి పంపించేవారు. పైగా వారు తిరిగి వెళ్ళేందుకు దారి ఖర్చులు కూడా ఇచ్చేవారట. అభిమానులను సావిత్రి అంత గొప్పగా చూసుకునేవారు. సావిత్రి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఆమె చేసిన కొన్ని తప్పులే ఆమె కెరీర్ చివర్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమెను ఎవరు ఆదుకోకుండా ఉండటానికి కారణం అయ్యాయని అంటారు.
ముఖ్యంగా ఏఎన్నార్- సావిత్రి డేట్లు పదే పదే బ్లాక్ చేయించే వారట. 34 సంవత్సరాలు పాటు వరుసగా సావిత్రి డేట్లు అన్ని తన సినిమాలు కోసమే ఉండాలని ఏఎన్ఆర్ నిర్మాతలతో ఒత్తిడి చేయించి మరి బ్లాక్ చేయించారు. ఆ సమయంలో సావిత్రి అటు శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, ఇటు తెలుగులో ఎన్టీఆర్ లాంటి హీరోల పక్కన నటించటానికి స్కోప్ లేకుండా పోయింది.
సావిత్రి కేవలం తన పక్కనే నటించాలన్న తాపత్రయంతో ఎఏన్నార్ ఆమెపై ఒత్తిడి చేసి తన సినిమాలకే డేట్లు కేటాయించేలా చేసేవారన్న అపవాది కూడా ఆయన పై ఉండేది. అందుకే సావిత్రి చివరి రోజ్లు ఇబ్బందులకు పడినప్పుడు కూడా అటు శివాజీ గణేషన్ ఇటు ఎన్టీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదని అంటారు. కేవలం ఏఎన్ఆర్ ను అతిగా నమ్మటం వల్ల సావిత్రి, ఎన్టీఆర్, శివాజీ గణేషన్ లాంటి స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయిందని అంటూ ఉంటారు.