సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లది కీలక పాత్ర. నటీనటులకు నిర్మాతలకు వాళ్ళు వారధుల్లా పనిచేస్తూ ఉంటారు. హీరో, హీరోయిన్ల డేట్లు మొదలు పారితోషకం వరకు అన్ని వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటారు. ఇక నటీనటులు కూడా మేనేజర్లు ఏది చెబితే అది ఫాలో అవుతూ ఉంటారు. అందుకే దర్శక, నిర్మాతలు అందరూ ముందుగా మేనేజర్ల వెంట పడుతూ ఉంటారు. మీ హీరోతో మా సినిమా సెట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రతిదీ మేనేజర్లు చూసుకోవాలి కాబట్టి స్టార్ హీరో.. హీరోయిన్లు చాలా నమ్మకస్తులను మాత్రమే మేనేజర్లుగా పెట్టుకుంటారు.
అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ దద్లాని ఒకరు. ఆమెకు షారుక్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. 2012 నుంచి ఆమె షారుక్‌కు మేనేజర్ గా పని చేస్తున్నారు. షారుక్ సినిమా వ్యవహారాలే కాకుండా షారుక్ పర్సనల్ విషయాలలో కూడా ఆమె సలహాలు ఇస్తూ ఉంటారు. 10 ఏళ్లకు పైగా షారుక్‌తో కలిసి పనిచేయడంతో వారికి ఫ్యామిలీతో ఆమె ఒక మంచి అనుబంధం ఏర్పడింది. షారుక్ భార్య గౌరీ ఖాన్ పూజను సొంత ఇంటి మనుషిలా చూసుకుంటుంది.
పలువురు సెలబ్రిటీల పార్టీలకు పూజతో కలిసి వెళుతుంది. ఇటీవల విడుదలైన జవాన్ సినిమా ప్రమోషన్ల విషయంలో పూజ కీలకంగా వ్యవహరించారు. ఇక షారుకు సంపాదన గురించి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో షారుక్ కూడా ఒకరు. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. రెడ్ చిల్లీస్ అనే బ్యానర్ స్థాపించి కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు..! షారుక్ భార్య గౌరీఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా భారీగా ఆర్థిస్తోంది.
షారుక్ ఫ్యామిలీ యేడాది సంపాదన రు.500 కోట్లు పైనే ఉంటుందట. ఇక తన వ్యవహారాలన్నీ చూసుకునే మేనేజర్ పూజకు షారుక్ భారీ వేతనాన్ని ఇస్తున్నాడట. ఏడాదికి షారుక్ ఏడు నుంచి తొమ్మిది కోట్ల వరకు పూజకు వేతనంగా చెల్లిస్తాడని బాలీవుడ్ మీడియా టాక్ .ఇక మేనేజర్ గానే కాకుండా ఆమె ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారట. ఆమె నికర సంపాదన విలువ రు. 50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ముంబైలోని లిస్టా జ్యూవెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానిని పూజా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు.