చారడేసి కళ్ళ అందంతో భానుప్రియ టాలీవుడ్లో ఒక మంచి హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ముఖ్యంగా సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో భానుప్రియను ఎంతో అందంగా చూపించేవారు. సితార సినిమాలో భానుప్రియ అందం చూసిన తెలుగు జనాలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆమె తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ నటించింది
ఆమె గొప్ప డ్యాన్సర్.. భరతనాట్యంలో భానుప్రియది కొట్టినపిండి. వెంకటేష్ – చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం భానుప్రియతో తాము డ్యాన్స్ చేయలేమని చెప్పేవారు అంటే ఆమె ఎంత గొప్ప డ్యాన్సర్ తెలుస్తోంది. ఇక డైరెక్టర్ వంశీ – భానుప్రియ ఇద్దరు ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి వారి ప్రేమ వచ్చేసింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే అప్పటికే వంశీకి పెళ్లయింది.. పిల్లలు కూడా ఉన్నారు.
భానుప్రియ తల్లికి వీరిద్దరూ ప్రేమలో పడటం నచ్చలేదు. దీంతో సీరియస్ గా ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. నీకు ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్నారు.. నువ్వు నీ కెరీర్ మీద దృష్టి పెట్టు.. ఇటు ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతుంది.. మీ వల్ల ఆమె కెరీర్ దెబ్బతింటుంది అంటూ ఇద్దరినీ బలవంతంగా విడదీసింది. దీంతో వంశీ.. భానుప్రియ ఎడబాటు తట్టుకోలేక ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆయన కెరీర్ గాడి తప్పింది. ఆ తర్వాత భానుప్రియ అమెరికాకు చెందిన ఎన్నారై ను పెళ్లి చేసుకున్నా అతడు చాలా ఇబ్బందులు పెట్టాడు.
చివరకు భర్త టార్చర్ భరించలేక అతడికి విడాకులు ఇచ్చేసి భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేసింది. జరిగిన పరిణామాలు తలుచుకుని ఎంతో ఆవేదనకు గురైన భానుప్రియకు మతిమరుపు వ్యాధి సోకింది. ఆమె దేనిని గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసారు. అటు సంపాదించుకున్న ఆస్తులు కూడా కోల్పోవాల్సి వచ్చింది. కేవలం భానుప్రియ తల్లి సరైన గైడెన్స్ ఇవ్వకపోవడంతో పాటు భానుప్రియను బాగా కంట్రోల్ చేయడంతోనే భానుప్రియ ఇలా పతనమైందని అంటారు.