Movies' ఖుషి ' సినిమా… ఆ విష‌యంలో విజ‌య్ టెన్ష‌న్ పెడుతోందెవ‌రు…...

‘ ఖుషి ‘ సినిమా… ఆ విష‌యంలో విజ‌య్ టెన్ష‌న్ పెడుతోందెవ‌రు… రిలీజ్‌కు ముందు కొత్త ప్రాబ్ల‌మ్‌…?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన సినిమా సెప్టెంబర్ 1న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాక బాగుందన్న నమ్మకాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం హీరో విజయ్ దేవరకొండ బాగా టెన్షన్ పడిపోతున్నట్టు తెలుస్తోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైం మొత్తం 165 నిమిషాల నిడివితో ఉంది సెన్సార్ వాళ్ళు యు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇక‌ సినిమా రన్ టైం 20 నిమిషాలు కట్ చేయాలని హీరోకు దర్శకుడు కి నిర్మాతల మధ్య పెద్ద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కనీసం 145 నిమిషాల రన్ టైం అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగితే అది సినిమా రిజ‌ల్ట్ పై బాగా ప్రభావం చూపుతుందని విజయ్ టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే దర్శికుడు వైపు నుంచి మరో వాదన కూడా ఉందట.

కథలో ప్రేక్షకులు లీనమై పోతే లెంత్ అన్నది పెద్ద సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇలా ప్రూవ్ చేశాయని ఖుషి కూడా ఖచ్చితంగా అలాంటి హిట్ సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నాడట. ఇటీవల రిలీజ్ అయిన కొత్త సినిమాలలో కోబ్రా 180 నిమిషాలు, అంటే సుందరానికి 176 నిమిషాలు అయితె ఈ సినిమాలు ప్లాప్ అవ్వటానికి సినిమా నిడివి కూడా ఒక కారణం అన్న
టాక్ ఉంది.

అయితే అదే టైమ్‌లో వాల్తేరు వీరయ్య 160 నిమిషాలు, వీరసింహారెడ్డి 169 నిమిషాలు, త్రిబుల్ ఆర్ 182 నిమిషాలు సినిమాలు భారీ ర‌న్ టైం తో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు రన్ టైం అనేది అసలు ఇష్యూ కాదని సినిమా బాగుంటే ప్రేక్షకులు మూడు గంటలైనా కూర్చుంటాడని దర్శకుడు నిర్మాత వైపు నుంచి వాదనగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news