Moviesరామ్‌చ‌ర‌ణ్‌కు జాతీయ అవార్డు రాకుండా అడ్డు ప‌డింది ఎవ‌రు… బ‌య‌ట ప‌డ్డ...

రామ్‌చ‌ర‌ణ్‌కు జాతీయ అవార్డు రాకుండా అడ్డు ప‌డింది ఎవ‌రు… బ‌య‌ట ప‌డ్డ నిజం…!

తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులలో అల్లు అర్జున్ పుష్ప సినిమాకి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు వ్యక్తిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ ఘటన ఆనందాన్ని నింపింది. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో రామ్ చరణ్ విషయంలో అవార్డుల విషయానికొస్తే ఇప్పుడు భాద‌ వెంటాడుతూ వస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే రామ్ చరణ్ నటించిన మగధీర సమయంలో రెండవ సినిమాకే అంత గొప్ప ప్రతిభ కనబరిచాడా అంటూ ప్రశంసలు వ్యక్తం అయ్యాయి.

ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. రామ్‌చరణ్ నటనకి నంది అవార్డు కూడా వస్తుందని అంతా అనుకున్నారు. ఉత్తమ నటుడుగా నంది అవార్డు కోసం చరణ్ పోటీపడ్డాడు కూడా అయితే ఆ సంవత్సరం అనుహికంగా మొత్తం అవార్డులు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సొంతం చేసుకున్నారు. మేస్త్రి సినిమాలో ఆయన న‌ట‌న‌కు అవార్డు దక్కింది. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నడుపుతుండగా దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

అసలు మేస్త్రి సినిమా కేవలం చిరంజీవిని రాజకీయంగా టార్గెట్ చేయడం కోసమే తీశారు.. అన్న చర్చ కూడా అప్పట్లో నడిచింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం జూరీని ప్రభావితం చేసి దాసరికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చేలా చేసింది అన్న విమర్శలు కూడా వినిపించాయి. ఇక రంగస్థలం సినిమాలో తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు రామ్ చరణ్ చిట్టిబాబుగా చెవిటి పాత్రలో చరణ్ నటనకు జాతీయ ఉత్తమన‌టుడిగా అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే అదే ఏడాది కీర్తి సురేష్ మహానటి, ఆయుష్మాన్ ఖురానా చెవిటి పాత్రలో నటించిన సినిమాలు పోటీ పడ్డాయి. చివరకు జూరీ ఆయుష్మాన్ ఖురానా వైపు మొగ్గుచూపింది కనీసం ఆయుష్మాన్ ఖురానా తో పాటు రామ్ చరణ్ కి కూడా సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పంచుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా చరణ్ కు నిరాశ తప్పలేదు. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ విషయంలో రామ్ చరణ్ ని మరోసారి దురదృష్టం వెంటాడింది.

ఈసారి కూడా చరణ్- బన్నీ ఇద్దరు అవార్డుల కోసం పోటీ పడతారు అన్న ప్రచారం జరిగింది. చివరకు బన్నీకే అవార్డు దక్కింది. అలా మూడుసార్లు రామ్‌చరణ్ జాతీయ అవార్డుల చివరి అంచల వరకు వెళ్లి నిరాశ చెందాల్సి వచ్చింది. మగధీర విషయంలో కచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్న దాసరి నారాయణరావుకి అవార్డు ఇవ్వాలన్న నిర్ణయం చరణ్ కు మైనస్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news