Moviesఎన్టీఆర్ డ్రాగ‌న్ : ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో బాల‌య్య హీరోయిన్‌...!

ఎన్టీఆర్ డ్రాగ‌న్ : ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో బాల‌య్య హీరోయిన్‌…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న‌ ‘డ్రాగన్‌’ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కనిపించబోతోంద‌ట‌. బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె ఓ పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో కనిపిస్తారని టాక్ ? గ‌తంలోనూ కేజీయ‌ఫ్ 2 సినిమాలో ప్ర‌శాంత్ నీల్ బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్‌తో ముఖ్య‌మంత్రి పాత్ర ప‌వ‌ర్ ఫుల్‌గా చేయించారు.Vidya Balan - Wikipediaఇప్పుడు డ్రాగ‌న్ లో విద్యా బాల‌న్‌తో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను చేయిస్తున్నార‌ట‌. ఆమె గ‌తంలో నంద‌మూరి హీరో బాల‌య్య‌కు జోడీగా ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలో న‌టించింది. ఆమె ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో కనిపించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest news