Moviesవార్ 2 : టీజ‌ర్ మొత్తం మీద ఆ సీన్‌లో కిక్కే...

వార్ 2 : టీజ‌ర్ మొత్తం మీద ఆ సీన్‌లో కిక్కే వేరప్పా ( వీడియో )

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్ల‌లోకి దిగుతోంది. ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా వార్ 2 టీం టీజ‌ర్ రిలీజ్ చేసింది. ఈ టీజ‌ర్‌లో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించారు. నా గురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్‌.. ‘గెట్‌ రెడీ ఫర్‌ ద వార్‌’ అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఉన్న ఈ డైలాగ్ టీజ‌ర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.War 2 Teaser Out: Hrithik Roshan, Jr NTR Make It 'Double The Fury', Film Releases On Aug 14 | Watch - News18ఇక రెండో పాట‌ను హృతిక్-ఎన్టీఆర్ పై షూట్ చేస్తారు. వచ్చే నెల హృతిక్-తారక్ పై ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేస్తారట, ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయంటున్నారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

 

Latest news