Moviesశ్రీకాంత్ ఓదెల‌కు మెగాస్టార్ కండీష‌న్లు...!

శ్రీకాంత్ ఓదెల‌కు మెగాస్టార్ కండీష‌న్లు…!

టాలీవుడ్‌లో ‘దసరా’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి రు. 100 కోట్లు కొల్ల‌గొట్టింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తీరు ప్రేక్షకులను అద్భుతః అన్న‌ట్టుగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్లోనే ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.థియేటర్లలో దసరా సందడి.. మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవే? | These are the  pluses and minuses of Nani Dasara movie?ఈ సినిమా కంటే కూడా మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కించే సినిమాపైనే ఇప్పుడు బజ్ ఎక్కువ క్రియేట్ అయ్యింది. త్వ‌ర‌లో రిలీజ్ అయ్యే చిరు విశ్వంభ‌ర సినిమా కంటే కూడా ఈ కాంబినేష‌న్ మీదే చ‌ర్చ న‌డుస్తోంది. కాగా ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెలను నాని చిరు వ‌ద్ద‌కు తీసుకెళ్లాడట. అయితే, మెగాస్టార్ ఈ సినిమా కథ నచ్చిన తర్వాత శ్రీకాంత్ ఓదెలకు ఓ కండీషన్ పెట్టాడట.శ్రీకాంత్ చెప్పిన కథను నాని ప్రొడ్యూస్ చేస్తేనే తాను సినిమాలో నటిస్తానని చెప్పాడ‌ట‌. అలా ఈ సినిమా నిర్మాత‌గా నాని వ‌చ్చి చేరాడు. చిరు విశ్వంభ‌ర‌, అనిల్ రావిపూడితో చేసే సినిమాల త‌ర్వాత ఇది ప‌ట్టాలు ఎక్క‌నుంది.

Latest news