ఈ తరం స్టార్ హీరోయిన్లలో చాలా మంది స్టార్ హీరోయిన్లు లక్కీ హీరోయిన్లు అనే చెప్పాలి .. అటు సీనియర్ హీరోలతో ఇటు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని ఈ జనరేషన్ స్టార్ హీరోయిన్లు సొంతం చేసుకుంటున్నారు .. బాబాయ్ బాలకృష్ణ తో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు .. అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలకృష్ణ కు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అట్టర్ ప్లాప్ ఇచ్చారు .. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు కోలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్ కుమార్తె స్టార్ హీరోయిన్ శృతిహాసన్ .శృతిహాసన్ , బాలయ్య తో కలిసి నటించిన సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది .. నిర్మాతలకు మంచి లాభాలు అందించింది అలాగే అదే శృతిహాసన్ ఎన్టీఆర్ పక్కన నటించిన సినిమా మాత్రం ప్లాప్ అయింది .. జూనియర్ ఎన్టీఆర్ , శృతిహాసన్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మాణ సాధ్యంలో హరీశంకర్ దర్శకత్వం లో రామయ్య వస్తావయ్య సినిమా తెరకెక్కింది .. ఈ సినిమాలో సమంత మరో హీరోయిన్గా నటించింది . భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలు అందుకోలేదు .. వాస్తవానికి ఈ సినిమాలో శృతిహాసన్ పల్లెటూరి యువతీ పాత్రలో నటించింది.
ఆ పాత్ర అనుకున్నంతగా సెట్ కాలేదు అన్న విమర్శలు వచ్చాయి .. ఇక రామయ్య వస్తావయ్య సెకండ్ హాఫ్ రొటీన్ కథ తో తెరకక్కెడం వల్ల కూడా ఈ సినిమా ప్లాప్ అయ్యింది .. ఇక అబ్బాయికు షాక్ ఇచ్చిన శృతిహాసన్ బాలయ్యకి జోడిగా వీర సింహారెడ్డి సినిమాలో నటించారు .. మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మించిన ఈ సినిమా కు మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు .. ఈ సినిమాలో బాలయ్య , శృతిహాసన్ జోడి బాగుంది అన్న కామెంట్లు కూడా వినిపించాయి .. ఆలా ఎన్టీఆర్ కు ప్లాప్ సినిమా ఇచ్చిన శృతిహాసన్ .. బాలయ్యకు మాత్రం మంచి హిట్ సినిమా ఇవ్వటం విశేషం ..
బాలకృష్ణకు న్యాయం చేసి జూనియర్ ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన హీరోయిన్..!
