ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ .. ప్రజెంట్ కంప్లీట్ చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో కూడా సినిమాలు చేస్తారా చేయరా అని అనుమానాలు అభిమానుల్లో గట్టిగా ఉన్నాయి .. రాజకీయాలు, సామాజిక సేవ , ప్రజా సంక్షేమ తన మొదటి ప్రాధాన్యతలని పవన్ గత ఎన్నికల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పారు .. ఇక నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలోను అదే సందేశం ఇచ్చారు .. సభకు వచ్చిన అభిమానులకు ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఇలాంటి నినాదాలు చేయొద్దని వారిని వాదించడం చూస్తే పవన్ ఆలోచన సినిమాల మీద లేదు అని అనిపిస్తుంది.ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే నిజంగా ఆయన్ని సమర్థించాల్సిందే .. ఎందుకంటే పవన్ కు ఖాళీ లేకపోవడంతో పాటు ఆరోగ్యం తరుచుగా ఇబ్బంది పెడుతూ వస్తుంది .. ఇక తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనంగా ఆయన మారిపోయారని మీ అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పడం అభిమానులను కొంత కదిలించింది .. ఇక ఈ లెక్కన హరిహర వీరమల్లు మేలో రిలీజ్ అయ్యాక ఈ సంవత్సరం లేద వచ్చే ఏడాది ఓజీ తో పవన్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పిన ఎలాంటి ఆశ్చర్యం లేదు .. వాస్తవంలో పవన్ సినిమాలకు సంబంధించిన కథలు వినడం లేదు .. గతంలో సురేందర్ రెడ్డితో అనుకున్న సినిమా సైతం ముందుకు వెళ్లే అవకాశం లేదని వినికిడి .
ఇలా ఒకరకంగా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగితే గొప్పే అనుకోవాలి .. వీటన్నిటి బట్టి హరిహర వీరమల్లు రెండు భాగాలు ఓజితో పవన్ అభిమానులు సంతృప్తి పడాల్సి ఉంటుంది .. గతంలో అజ్ఞాతవాసి సినిమాతో ఆపేసి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటారని చెప్పిన పవన్ తర్వాత ఓటమి పార్టీ నడపడానికి నిధులు అవసరమై తిరిగి సినిమాలు చేశారు .. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది .. డిప్యూటీ సీఎంగా ఉంటూనే కీలక శాఖలో పవన్ ఆధ్వర్యంలో ఉండటంతో ఇకపై మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు సినిమాలు చేయటం కుదరదు .. ఇదంతా దృష్టిలో పెట్టుకునే పవన్ పెద్ద కొరకు అకిరా నందన్ ని ఇంకో రెండేళ్లలో హీరోగా లాంచ్ చేసే ప్లాన్ జరుగుతుందని మెగా వర్గాల నుంచి అందుతున్న టాక్ .
ఓజి తర్వాత సినిమాలకు పవన్ గుడ్ బాయ్ .. డిప్యూటీ సీఎం సంచల నిర్ణయం..!
