టాలీవుడ్ మెగాపవర్ స్టార్ … గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజప్పాయింట్ చేసిన రామ్‌చరణ్ కెరీర్‌లో బుచ్చి బాబు సినిమా 16వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇక స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
చరణ్ ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమా కథ క్రికెట్ ఆట చుట్టూ తిరుగుతుందని.. అందుకే ఈ టైటిల్ అయితే కరెక్టుగా యాప్ట్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఇక ఈ సినిమాలో కుస్తీకి సంబంధించిన నేపథ్యం కూడా ఉందట. అయితే క్రికెట్ పాపులర్ గేమ్ కావడంతో పవర్ క్రికెట్ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తారా ? లేదా మరో టైటిల్ పెడతారా ? అన్నది చూడాలి. పవర్ క్రికెట్ అంటే అది నేషనల్ వైడ్‌గా అందరికి సులువుగా కనెక్ట్ అయిపోతుంది. ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.