నందమూరి నటసింహ బాలకృష్ణ వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య చివరి 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వరుసగా అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి .. తాజాగా ఈ సంక్రాంతికి డాకూ మహారాజు సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. డాకూ మహారాజ్ సినిమా అయితే ఏకంగా 180 కోట్ల వసూళ్లు కలగొట్టి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన కెరీర్లో ఇప్పటివరకు 109 సినిమాలలో నటిస్తే అందులో 71 సినిమాలు సెంచరీలు ఆడాయి.బాలయ్య నటించిన యావరేజ్ సినిమాలు ప్లాప్ సినిమాలు డిజాస్టర్ సినిమాలో సైతం కొన్ని కేంద్రాలలో వంద రోజులు ఆడాయి. ఇటీవల కాలంలో బాలయ్య నటించిన లయన్, డిక్టేటర్ రెండు సినిమాలు కూడా సెంచరీలు కొట్టాయి. డిక్టేటర్ యావరేజ్ అనిపించుకున్న .. లయన్ అయితే డిజాస్టర్ అయింది. అనూహ్యంగా ఈ రెండు సినిమాలు కూడా సెంచరీలు ఆడటం విశేషం. లయన్ సినిమా చిలకలూరిపేటలోని శ్రీ రామకృష్ణ థియేటర్లో డైరెక్ట్‌గా వంద రోజులు ఆడింది.
ఇక డిక్టేటర్ సినిమా ఉత్తరంధర్ లోని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక బాలయ్య బ్లాక్ బస్టర్ లెజెండ్ సినిమా అయితే రెండు థియేటర్లలో 400 రోజులు అడగా.. ఒక ధియేటర్లో ఏకంగా 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ రెండు కూడా రాయలసీమలోని ఎమ్మిగనూరు – ప్రొద్దుటూరు కేంద్రాలు కావడం విశేషం.
బాలయ్య లయన్ – డిక్టేటర్ కూడా సెంచరీలు ఆడేశాయా.. ఏ సెంటర్లలోనో తెలుసా..!
