Moviesడాకూ మ‌హారాజ్ OTT : బాల‌య్య ఫ్యాన్స్‌కు మళ్లీ పూన‌కాలు లోడింగే..!

డాకూ మ‌హారాజ్ OTT : బాల‌య్య ఫ్యాన్స్‌కు మళ్లీ పూన‌కాలు లోడింగే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన సినిమా డాకు మహారాజ్.. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే 56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవ‌రాల్‌గా రు. 180 కోట్ల వ‌సూల్లు రాబ‌ట్టిన ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమాలో చాందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలకమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు బాబీ డియోల్ విల‌న్‌గా నటించారు.Daku Maharaj : డాకు మహరాజ్ న్యూ లుక్.. అదిరిపోయిందిగా | Daku Maharaj New  Look.. Is Amazing

వెండితెర‌ను షేక్ చేసిన ఈ సినిమా బుల్లితెర‌పై ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ? అని నంద‌మూరి.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఓటీటీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. డాకూ మ‌హారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డాకూ మ‌హారాజ్ ఫిబ్ర‌వ‌రి 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంద‌నే వార్త‌లు వినిపించాయి. అయితే అది నిజం కాలేదు.Daaku Maharaaj Day3 collections: బాక్సాఫీస్‌ వద్ద డాకు మహారాజ్ మాస్  తాండవం.. మూడో రోజు ఎన్ని కోట్లంటే? | Nandamuri Balakrishna Urvashi Rautela  Daaku Maharaaj Day 3 Box Office Collection - Telugu ...ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్ర‌కారం వ‌చ్చే వీకెండ్‌లోనే డాకూ ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుంద‌ట‌. అలాగే బాలయ్య ఫ్యాన్స్ కి ఒక సడన్ సర్ప్రైజ్ ఏంటంటే డాకు మహారాజ్ సినిమాలో మరికొంత కొత్త కంటెంట్ సైతం యాడ్ చేసి మ‌రీ స్ట్రీమింగ్ చేస్తున్నార‌ట‌. థియేట‌ర్ల‌లో చూడ‌ని కొన్ని స‌న్నివేశాలు ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌లో చూడ‌వ‌చ్చ‌న్న‌మాట‌. మ‌రి థియేట‌ర్ల‌లో మిస్ అయిన ఆ కొత్త సీన్లు ఏమై ఉంటాయా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

Latest news