టాలీవుడ్‌లో హిట్ మెషిన్ డైరెక్టర్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన నుంచి వచ్చిన రీసెంట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో హిట్ సినిమాగా నిలిచిందో చూశాం. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించడంతో వారిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి చూపు అనిల్ రావిపూడి తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది ? ఎలా ఉంటుందన్న దానిపై పడింది.ఇప్పటికే తన తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నట్టు అనిల్ రావిపూడి ప్రకటించాడు. ఈ సినిమా కూడా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానుందని అనిల్ చెపుతున్నారు. ఈ సినిమాలో అనిల్ వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నట్లు ఇప్పటికే చెప్పేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో ‘రౌడీ అల్లుడు’ లాంటి వింటేజ్ చిరంజీవిని మనకు చూపించబోతున్నాడట. నిజంగా సంక్రాంతి అల్లుడు టైటిల్ పెడితే అది మామూలు సంచలనం కాదనే చెప్పాలి.
మెగాస్టార్ సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్ ఫిక్స్ …!
