టాలీవుడ్‌లో అక్కినేని అభిమానులు తమ అభిమాన హీరోల నుంచి ఒక్క హిట్ వస్తే బాగుంటుందని గత కొద్ది రోజులుగా సాలిడ్‌గా వెయిట్ చేస్తున్నారు. అక్కినేని హీరోలు కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా హిట్లు పడడం లేదు. అందరూ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ లలో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కంబ్యాక్ కూడా ఒకటి. మరి ఈ కంబ్యాక్ ఫైనల్ గా ఇపుడు “ తండేల్ ” సినిమాతో వచ్చేసింది.ముందు నుంచి కూడా తండేల్ సినిమా రిజల్ట్ విషయంలో అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచే సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకు పోతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 41 కోట్లకి పైగా గ్రాస్ అందుకున్న తండేల్ ఇక రు. 50 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేస్తోంది. ఇక తండేల్ వరల్డ్ వైడ్ గా పెట్టుకున్న టార్గెట్ కేవలం ఈ మూడు రోజుల్లోనే 75 శాతం రికవరీ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
అయితే ఇంత పెద్ద హిట్ చైతు ఖాతాలో వేస్తారా ? లేదా సాయి పల్లవి ఖాతాలో పడుతుందా ? అన్న చర్చలు సోషల్ మీడియా వర్గాల్లో నడుస్తున్నాయి. తండేల్ సినిమాలో చైతుకు జోడీగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే గీతా ఆర్ట్స్ 2 వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.
‘ తండేల్ ‘ 3 రోజుల కలెక్షన్లు … ఈ కుమ్ముడు క్రెడిట్ చైతుకా.. సాయి పల్లవి ఖాతాలోకా..?
