టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ రీజనల్ లాంగ్వేజ్ సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు.ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను తొలుత ఓటీటీలో కాకుండా శాటిలైట్‌లో టెలికాస్ట్ చేసేందుకు జీ ప్లాన్ చేస్తుంది. జీ తెలుగు ఛానల్‌లో ఈ సినిమాను ముందుగా టెలికాస్ట్ చేస్తే, థియేటర్స్‌లో వచ్చిన రెస్పాన్స్ బుల్లితెరపై కూడా మరోసారి చూడొచ్చని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ముందుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిన 5 వారాలకు డిజిటల్ టెలికాస్ట్ చేయనున్నారని.. ఈ లెక్కన ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఓటీటీలో కాకుండా ముందుగా టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ అయితే టాలీవుడ్‌లోనే సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త ట్రెండ్ సెట్ చేసినట్టే అవుతుంది.
టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ .. !
