మన తెలుగు చిత్ర పరిశ్రమలు వచ్చే సినిమాలు ప్రస్తుతం ఇండియన్ సినిమాను శాసిస్తున్నాయి .. టాలీవుడ్ పేరు చెబితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది .. బాహుబలి సినిమాలతో మొదలైన ఈ దండయాత్ర ఇప్పుడు ఇండియన్ సినిమాకి తెలుగు సినిమాను రారాజుగా మార్చింది .. ఇలా ఈ దండయాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో తాజాగా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా ఒకటి .. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాకు సీక్వల్ గా వచ్చిన పుష్ప2 . ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసి .. పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి , బాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులు సైతం కొల్లగొట్టింది .. ఇప్పటికే ఈ సినిమా 1900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇలా ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హైయెస్ట్ కలెక్షన్ రాబెట్టిన సినిమాల్లో నెంబర్ వన్ సినిమాగా పుష్ప2 తో అల్లు అర్జున్ పాన్ ఇండియా బాక్సాఫీస్ కు మొగుడిగా నిలిచాడు.
పుష్ప సినిమాతో భారీ విజయ అందుకోవటమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ .. ఇలాంటి సమయంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు .. ప్రస్తుతం తన తర్వాత సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నారు . ఇలాంటి క్రమంలో ఆయన చేయబోయే సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది తర్వాత ఆయన క్రేజ్ ఎంతలా మారిపోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయబోయే సినిమా కూడా ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు చేయని డిఫరెంట్ కథతొ రాబోతుందట .. అయితే ఇప్పుడు రీసెంట్గా మహా కుంభమాళాలో నెటిజన్లు ఎంతగానో ఆకర్షించిన అమ్మాయి .. మోనాలిసా .. ఈమెకు సంబంధించిన వీడియోలు కూడా ఎంతో వైరల్ గా మారాయి .. చూడడానికి చాలా అందంగా ఉన్న ఈ అమ్మాయికి ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా అవకాశం కూడా వచ్చింది .. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఈమెను అల్లు అర్జున్ తో తెరకెక్కించబోయే సినిమాల్లో ఒక ప్రత్యేక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది మాత్రం త్రివిక్రమ్ కి తెలియాలి .. ఒకవేళ నటించినా కూడా ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందని కూడా మరి కొందరు అంటున్నారు .
అలాగే త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు .. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో కూడా ఆమెని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోతో పాన్ ఇండియా హీరో సినిమాలో భారీ అవకాశాన్ని అందుకున్న మోనాలిసాకు ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి .. ఈ సినిమాతో ఈమె సూపర్ సక్సెస్ సాధిస్తే ఈమె కెరీర్ కు అసలు తిరుగుండదని కూడా అంటున్నారు. ఇక మరి ఏదేమైనా కూడా త్రివిక్రమ్ ఆమె పాత్రను ఈ సినిమాలు ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ గా మారింది . అలాగే అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.