పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా త్రివిక్రమ్ ది అని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ సినిమాతో పాటు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తారని టాక్ కూడా ఉంది. ఏమైనా సరే పుష్ప సిరీస్ వల్ల నష్టపోయిన టైం కవర్ చేయాలన్నది బన్నీ ప్లాన్. త్రివిక్రమ్ సినిమా చాలా పెద్ద సినిమా కనీసం రెండేళ్లు పడుతుంది అని తెలుస్తుంది. ఇంకా ఎక్కువ పట్టిన ఆశ్చర్యం లేదట. ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద షెడ్యూల్ మే లేదా జూన్లో పూర్తిచేసి అట్లే సినిమా మీదకు బన్నీ వెళతారని తెలుస్తోంది.అయితే తాజా సమాచారం ప్రకారం అట్లీ సినిమాను ముందుగా మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బన్నీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బన్నీ తన ఆలోచనను తాజాగా జరిగిన పుష్ప 2 ఫంక్షన్ తర్వాత పార్టీలో కొందరు సన్నిహితులతో పంచుకున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏంటంటే ఈ ఫంక్షన్ జరగడానికి ఒక రోజు ముందే అట్లీ టీంకు చెందిన ఒక కీలక వ్యక్తి వచ్చి బన్నీని కలిసి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. అట్లే సినిమా ఇప్పుడు మొదలుపెడితే కనీసం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ ఉంటుంది.
అలా కాకుండా త్రివిక్రం సినిమా .. అట్లీ సినిమా రెండు ఒకేసారి చేస్తే అట్లే సినిమా 2026 డిసెంబర్ కు కానీ విడుదల చేయలేరు. పైగా త్రివిక్రమ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. అందువల్ల రెండు సినిమాలు ఒకేసారి చేయకుండా ముందు అట్లీ సినిమా పూర్తి చేసి తర్వాత త్రివిక్రమ్ సినిమా మీదకు వెళతారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు హారిక హాసిని – గీతా సంస్థలు నిర్మాతలు అయితే .. అట్లీ సినిమాకు సన్ నెట్వర్క్ సంస్థ నిర్మాత. ఏది ఏమైనా ఈ లెక్కను చూస్తుంటే బన్నీ త్రివిక్రమ్ కు అంత వన్ సైడ్గా డేట్లు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు.
బన్నీ – త్రివిక్రమ్‌ను ఇబ్బంది పెడతాడా…?
