నందమూరి నటసింహా బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖండ 2 లో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించే ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. అఖండ 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలయ్య వరుసగా అఖండ – వీర సింహారెడ్డి – భగవంత్ కేసరి – డాకు మహారాజు లాంటి సూపర్ డూపర్ హిట్స్ సినిమాలలో నటించి కెరీర్ లోనే ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే అఖండ 2 సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అదే సెంటిమెంట్తో అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి మరోసారి భయంకరమైన ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాలయ్య కోసం ఆ బ్లాక్‌బస్టర్ సెంటిమెంట్ రిపీట్ చేసే పనిలో బోయపాటి..?
