Moviesఈ "సంక్రాంతి" తెలుగు సినిమాలకు నేర్పిన పెద్ద గుణపాఠం ఇదే..ఇకనైనా మేలుకుంటే...

ఈ “సంక్రాంతి” తెలుగు సినిమాలకు నేర్పిన పెద్ద గుణపాఠం ఇదే..ఇకనైనా మేలుకుంటే బెటర్..!

సాధారణంగా సంక్రాంతి రేసులో ఎప్పుడు కూడా బడాబడా సినిమాలే ఉంటాయి . కచ్చితంగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఇది నిన్నో.. మొన్న వచ్చిన సాంప్రదాయం కాదు కొన్ని ఏళ్ల తరబడి ఇదే విధంగా ముందుకు వెళుతూ వస్తుంది. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే కచ్చితంగా ఇద్దరు ముగ్గురు స్టార్ హీరో సినిమాలైనా సరే సంక్రాంతి రేసులో ఉంటాయి. కాగా ఈ సంక్రాంతి రేసులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘గేమ్ చేంజఋ.. నందమూరి హీరో బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’.. ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. మూడు సినిమాలు రేస్ లో నిల్చున్నాయి. మరీ ముఖ్యంగా మూడు సినిమాలపై పాజిటివ్ టాక్ వస్తుంది అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు .

అనుకున్న విధంగానే మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అయితే మూడు సినిమాలలో కంపేర్ చేస్తే ‘గేమ్ చేంజర్’ కూసింత నెగిటివ్ టాక్ దక్కించుకుంది . కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఫుల్ స్వింగ్ మీద ముందుకు దూసుకెళ్తుంది. గేమ్ చేంజర్ సినిమా తొలి రోజు మిక్స్డ్ టాక్ దక్కించుకోగా ..156 కోట్లు వసూళ్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే . ‘డాకు మహారాజ్’ సినిమా ఫస్ట్ షో తోనే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ సంపాదించుకుంది . కలెక్షన్స్ పరంగా కూడా ‘డాకు మహారాజ్’ ఎవరికీ అందనంత స్థాయిలో ముందుకు వెళ్ళిపోతుంది .

రీసెంట్గా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫుల్ ఎంటర్టైర్యంగా ముందుకు వెళ్తుంది . వెంకి ఫ్యామిలీ హీరో గా నటిస్తే సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే . కాగా మూడు సినిమాలు ఓకే ..టాక్ ప్రకారం కలెక్షన్స్ ప్రకారం బాగానే ముందుకెళ్తున్నాయి . కానీ సంక్రాంతి రేసులో ఉండే సినిమాలకు వచ్చే అంత కలెక్షన్స్ మాత్రం రావడం లేదని చెప్పాలి. మరి ముఖ్యంగా దీనికి మెయిన్ కారణంగా పైరసీ అంటూ చెబుతున్నారు సినీ విశ్లేషకులు . ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్ పైరసీ విషయంలో కూసింత నెగ్లేట్ చేస్తున్నారని .. ఆకారణంగానే సినిమాకి కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు .

Sankranthiki Vasthunam Twitter Review : సంక్రాంతికి వస్తున్నాం మూవీ  ట్విట్టర్ రివ్వూ.. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో నవ్వించిందా...? - Telugu  News | Venkatesh Sankranthiki ...రీసెంట్ గా ఓ సినిమాలో “గేమ్ చేంజర్” సినిమాను ఎలా ఓపెన్ గానే టెలికాస్ట్ చేస్తున్నారో అందరం చూసాం. “డాకు మహారాజ్” కి కూడా ఇంచుమించు అదే పరిస్థితి . అయితే ఇలా సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోనే సేమ్ హెచ్డి ప్రింట్ క్వాలిటీతో సినిమా బయట కు వచ్చేస్తూ ఉండడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది . కానీ ఏ నిర్మాత కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోకపోతూ ఉండటంతో ఫ్యూచర్లో ఇదే విధంగా ముందుకు కొనసాగితే సినిమాల పరిస్థితి దారుణంగా ఉంటుంది అని .. ప్రొడ్యూసర్స్ కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించొచ్చు కానీ కలెక్షన్స్ ప్రకారం మాత్రం ఆ స్థాయి రాలేకపోవచ్చు అని అంటున్నారు . అందుకే కొంతమంది మేకర్స్ దొంగ కలెక్షన్స్ కూడా చెప్పుకొస్తున్నారు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ఏదేమైనా సరే ప్రొడ్యూసర్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా పైరసీ విషయంలో డెసీషన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటూ సినీ స్టార్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు..!

Latest news