“డాకు మహారాజ్”.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సైలెంట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ నే ఈ “డాకు మహారాజ్”. వీళ్ల కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా టైటిల్ ని వెరైటీగా పెట్టి క్రేజీగా ఫ్యాన్స్ అటెన్షన్ గ్రాబ్ చేశాడు బాబి . ఆ తర్వాత సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క టీజర్ ట్రైలర్ పోస్టర్స్ అభిమానులకు పిచ్చెక్కించేలా చేసింది. సంక్రాంతి కానుక థియేటర్స్ లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ చేసేస్తుంది . మరి ముఖ్యంగా బాలయ్య ఊర మాస్ తాండవం.. సినిమాకి హైలైట్ గా మారింది బాలయ్య నోటి నుంచి వచ్చిన ఒక డైలాగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంది అంతేకాదు వైలెన్స్ కే వైలెన్స్ అంటూ వైలెన్స్ కి దడ పుట్టించాడు బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ గా మారింది.తమన్ సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ లో ఒక్కొక్క స్కోర్ మ్యూజిక్ ముందుకు వెళుతూ ఉంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉన్నాయి . కాగా డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఈ సినిమా ఏ విధంగా కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు . మొదటిరోజు ఎవరు ఊహించిన విధంగా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు వసూలు చేసింది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇది నిజంగా బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అనే చెప్పాలి.
కాగా నిన్న వీకెండ్ పైగా పండుగ కూడా దానితో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది “డాకు మహారాజ్” అని చెప్పడంలో సందేహం లేదు. కాగా రెండవ రోజు ఏ విధమైన కలెక్షన్స్ అందుకుంటుంది అంటూ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ..దాదాపు డాకు మహారాజు రెండవ రోజు 9-11 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు 27.8 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఫుల్ సెంటిమెంట్ యాక్షన్ ఈ మూవీ సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్ ను మరింత కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అలాగే మాస్ సెంటర్స్ లో పెర్ఫార్మెన్స్ అంచనాలను కనుక మించి పోతే డబుల్ డిజిట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి మొత్తానికి కెరియర్లో డాకు మహారాజ్ సినిమాతో ఒక సెన్సేషనల్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య..!