Movies' సంక్రాంతికి వ‌స్తున్నాం ' @ 230 కోట్లు... వెంకీ మామ...

‘ సంక్రాంతికి వ‌స్తున్నాం ‘ @ 230 కోట్లు… వెంకీ మామ కుమ్ముడు అదుర్స్‌…!

టాలీవుడ్లో ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన సినిమాల‌లో సీనియ‌ర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెర‌కెక్కిన సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం. టాలీవుడ్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఇపుడు భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా అదరగొడుతుంది. వెంక‌టేష్‌ కెరీర్ లోనే కాకుండా మన తెలుగు సంక్రాంతి బరిలో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ లిస్ట్ లో చేరి రికార్డుల మీద రికార్డులు క్రాస్ చేస్తోంది.ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మొత్తం 11 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న సంక్రాంతికి వ‌స్తున్నాం సాలిడ్ మార్క్ 230 కోట్ల గ్రాస్ ని దాటినట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సూప‌ర్‌ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళుతోంద‌నే చెప్పాలి.వ‌చ్చే వీకెండ్‌లో ఈ సినిమా మళ్ళీ డెఫినెట్ గా మరింత ఊపందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇదే ఊపు కంటిన్యూ అయితే లాంగ్ ర‌న్లో ఈ సినిమా రు. 300 కోట్ల గ్రాస్ వ‌సూల్లు కొల్ల‌గొట్ట‌డం ప‌క్కా గ్యారెంటీయే..!

Latest news