గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘డాకు మహారాజ్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మూడు పెద్ద సినిమాల పోటీ మధ్యలో కూడా డాకూ కుమ్మి పడేశాడు. బాలయ్య మాస్ నట విశ్వరూపం చూపించడంతో బాలయ్య ఖాతాలో వరుసగా నాలుగో హిట్ పడింది.బాలయ్య గత నాలుగు హిట్ సినిమాలకు వరుసగా థమన్ సంగీతం అందిస్తూ వస్తున్నారు. ఈ నాలుగు సినిమాల విజయంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. ఇదిలా ఉంటే బాలయ్య చేయబోయే తర్వాత సినిమాలకు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది.. బాలయ్య చేసే ఒక సినిమాకు కాకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడట. ఇప్పటికే బాలయ్య తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి బాలయ్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా అనిరుధే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట. ఇలా బ్యాక్ టు బ్యాక్ అనిరుధ్ వరుసగా రెండు సినిమాలకు మ్యూజిక్ అంటే మామూలు మాస్ రచ్చ కాదు.
బాలయ్య కోసం అనిరుధ్.. ఒకటి కాదు రెండు ఛాన్సులు పట్టేశాడు…!
