టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రాన్ని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని దాదాపు ఖరారు చేసేసారు. తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్‌కు రావడంతో పాటు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆమె ఈ సినిమాలో నటించే విషయంపై కాల్ సీట్లు.. ఇతర విషయాలపై చర్చించేందుకు నేరుగా హైదరాబాదులో ల్యాండ్ అయిందని అంటున్నారు.
దీనిపై సస్పెన్స్ లేకుండా ప్రియాంక చోప్రా కొత్త చాప్టర్ మొదలైంది అంటూ స్వయంగా ప్రకటించింది. చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక దేవుడు ఆశీస్సులతో కొత్త చాప్టర్ మొదలైంది అంటూ పోస్ట్ పెట్టింది అలాగే హైదరాబాదులో తనకు సహాయ సహకారాలు అందించిన ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. దీనికి రిప్లై ఇస్తూ కొత్త సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని ఉపాసన స్పందించింది.ప్రియాంక చోప్రా పోస్ట్ ఉపాసన దానికి రిప్లై ఇవ్వడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టులోకి ప్రియాంక చోప్రా హీరోయిన్గా వచ్చి చేరిందన్న విషయం దాదాపు ఖరారు అయింది. దీనిపై అధికారిక ప్రకటన రావటమే ఆలస్యం. ఇక మహేష్ బాబు – రాజమౌళి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరిగినట్టు ప్రచారం జరిగిన రాజమౌళి మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. మరి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అన్న విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.