Movies' రాజాసాబ్ ' పై ప్ర‌భాస్‌ ఫ్యాన్స్‌లో టెన్ష‌న్‌... ఇప్ప‌ట్లో రిలీజ్...

‘ రాజాసాబ్ ‘ పై ప్ర‌భాస్‌ ఫ్యాన్స్‌లో టెన్ష‌న్‌… ఇప్ప‌ట్లో రిలీజ్ లేన‌ట్టేనా..?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌ సినిమా సమ్మర్ బ‌రిలో నుంచి దాదాపు తప్పుకుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అన్నది తెలియదు. మార్కెటింగ్ పనులు ఉండనే ఉన్నాయి. ఇక సినిమా వర్క్ .. సిజి పనులు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం హీరో లేకుండా ఉన్న సీన్లు షూటింగ్ చేస్తున్నారు. సినిమాకు బ్యాలెన్స్ వర్క్ 20 రోజులకు పైనే ఉందని తెలుస్తోంది. వీటితోపాటు అదనంగా ప్యాచ్ వర్క్ కూడా ఉండనే ఉంటుంది. ఇక పాటలు కూడా షూట్ చేయాలి. ఏది ఏమైనా గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తే రెండు నెలలకు పైగా పని ఉంటుంది.రాజాసాబ్‌' వచ్చేస్తున్నాడని ప్రకటించిన మేకర్స్‌ | Prabhas The Raja Saab  Glimpse Release Date Locked | Sakshiఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. సీజీ పనులు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రాజాసాబ్‌ దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే. హ‌ను రాఘవపూడి ఫౌజీ సినిమా షూట్ ఇప్పుడే ప్రారంభమైంది. అది రిలీజ్ కావాలంటే ఏడాది పడుతుంది. బాగా స్పాన్ ఉన్న కథ‌ అది.. డిఫరెంట్ లొకేషన్ లో షూట్ చేయాలి. ఏది ఏమైనా రాజాసాబ్‌ సినిమా త్వరగా వస్తుందని ఆశించిన ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు నిరాశ తప్పడం లేదు.సమ్మర్లో వస్తుంది అనుకున్న సినిమా ఏకంగా దసరాకు వెళ్లిపోయింది. ఈ సినిమాకు ఏకంగా 200 కు పైగా వర్కింగ్ డేస్ అవసరమైనట్టు తెలుస్తుంది. ఇందులో హీరో పని చేసిన రోజులు ..హీరో లేకుండా షూట్ చేసిన రోజులు సరి సమానంగా ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు మారుతీ తన కెరీర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇదే కావటం విశేషం.

Latest news