టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. చెర్రీ – మెగా అభిమానులకు నాలుగు రోజులు ముందే సంక్రాంతి వచ్చేసింది. ఈ సంక్రాంతికి ముందుగా రిలీజ్ అయిన ఈ భారీ సినిమాకు ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి నుంచి.. తెలంగాణలో తెల్లవారుజాము నుంచి షోలు మొదలయ్యాయి. ఏ థియేటర్ దగ్గర చూసిన అభిమానుల కోలాహాలం కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? చూసిన వాళ్ళు ఏమంటున్నారు.. సోషల్ మీడియాలో ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం. శంకర్ పాత కథనే ప్లాట్ నెరేషన్‌తో నడిపించాడని ఫ్యాన్స్ చెపుతున్నారు. రెండు పాత్రల్లో ఒదిగిపోతూ నటనలో మరో మెట్టు పైకి ఎక్కాడని అంటున్నారు. ముఖ్యంగా ఇది గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్ కి కెరీర్ చేంజర్ సినిమా కూడా అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.దర్శకుడు శంకర్ మరోసారి తన మార్కు చూపించారని అంటున్నారు. కథ, నటీనటులు పెర్ఫార్మన్స్ టెక్నికల్ అంశాల్లో ఈ సినిమా అద్భతంగా ఉందంటున్నారు. ప్రతి సినిమాలో తన మార్కు చూపిస్తున్న ఎస్.జె. సూర్య ఈ సినిమాలో కూడా రాజకీయ నాయకుడిగా అద్భుతమైన పాత్రను పోషించారు. హీరోయిన్ల కీయారా అద్వాని – అంజలి తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెబుతున్నారు. సినిమాలో పాటలు విజువల్స్.. బిగ్ స్క్రీన్ పై కళ్ళు చెదిరిపోయేలా ట్రీట్ ఇస్తున్నాయని అంటున్నారు. చాలా సీన్లను బ్యాగ్రౌండ్ స్కూల్ బాగా ఎలివేట్ చేసిందని అంటున్నారు. మొత్తంగా సినిమా చూసిన వాళ్ళు కమర్షియల్ ఎంటర్టైనర్ గా శంకర్ మార్క్‌తో ఉందని అంటున్నారు.అలాగే కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథ కొత్తగా లేదని .. అవినీతి ఐఏఎస్ అధికారి అడ్డుకోవడం .. సీఎం సీటు కోసం కొందరు కుట్రలు పన్నటం .. రాజకీయ ఎత్తులు.. ఆదర్శాలను.. నమ్మిన వ్యక్తిని నమ్మిన వారి వెన్నుపోటు పడటం .. అన్యాయం చేసిన వారికి అతడి వారసుడు దెబ్బతీయటం చుట్టూ కథ సాగుతుంది. కథలో మెరుపులు ఉన్నాయి.. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. కథ మరీ కొత్తది కాకపోయినా జస్ట్ ఓకే అనేలా ఉందని.. కథనం సైతం శంకర్ రొటీన్ గానే మొదలుపెట్టి కొన్నిచోట్ల క్లాస్ టచ్ తీసుకున్నట్టు ఉందని .. లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని కాలేజ్ ఎపిసోడ్ బోర్ తెప్పిస్తుందని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ సినిమాకు జస్ట్ ఓకే టాక్ అయితే వచ్చింది. శంకర్ సహనానికి పరీక్ష పెట్టాడంటున్నారు.
Movies' గేమ్ ఛేంజర్ ' ఫైనల్‌గా హిట్టా... ఫట్టా... శంకర్ సహన...
‘ గేమ్ ఛేంజర్ ‘ ఫైనల్‌గా హిట్టా… ఫట్టా… శంకర్ సహన పరీక్షేనా..!
- Tags
- anjali
- Dil Raju
- director shankar
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- game changer review
- genuine news
- hero Ram Charan
- intresting news
- intresting updates
- journalist excluisve
- kiara advani
- Latest News
- latest trending news
- ram charan
- ram charan game changer review
- social media
- star hero
- star heroine
- super news
- taman ss
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news