మంచు కుటుంబంలో అసలే ఏం జరుగుతుందో ? పూర్తి ఆధారాలతో సహా తాను చెపుతానని మంచు మనోజ్ అన్నారు. జర్నలిస్టుల ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఊహించలేదని.. గాయపడ్డ సోదరులకు మా నాన్న, అన్న తరపున తాను క్షమాపణలు చెపుతున్నట్టు మనోజ్ తెలిపారు. నాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన మీకు ఇలా జరగడం బాధాకరమన్నారు. చివరకు ఇందులో నా భార్యతో పాటు ఏడు నెలల నా కుమార్తె పేరు కూడా లాగుతున్నారని మనోజ్ వాపోయారు.నా భార్య కూడా వాళ్ల ఇంటి నుంచి ఏం తీసుకు రాలేదని.. నేను కూడా ఇంట్లో డబ్బు, ఆస్తి అడగలేదని… నా భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా అంకుల్, మా నాన్న స్నేహితులు ‘మనోజ్.. మీ నాన్నగారు, అమ్మగారు ఒక్కరే ఉంటున్నారు. మీ అన్న దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యాడు. నీ భార్య గర్భవతి, తనకు తల్లిదండ్రులు లేరు. తనకిప్పుడు మీ అమ్మ అవసరం ఉంది. పెద్దల అవసరం ఉంది. నువ్వు ఒక్కడివి ఎలా చూసుకుంటావ్..’ అని చెబితే.. నా భార్య కూడా అంతమంది చెబుతున్నారని రిక్వెస్ట్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్లామని మనోజ్ చెప్పాడు.ఈ రోజు ఇన్ని ఆరోపణలు చేస్తుంటే తాను ఆధారాలు మాత్రమే చూపిస్తానని.. స్కూల్ పిల్లలు.. అక్కడ చుట్టు పక్కల గ్రామాల వాళ్లు మావాళ్లే… వాళ్లంతా నాకు ఆర్జీలు పంపుతుంటే… వినయ్‌కు కాల్ చేసి వాళ్లకు న్యాయం చేయండి అంటే అతడు నాతో దురుసుగా ఆన్సర్ చేశాడని.. తాను అవసరం అయితే కాళ్లమీద పడి అడుగుతాను.. వాళ్ల ఇష్యూ క్లీయర్ చేయమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఓపిక పట్టానని.. ఇక మీడియా సమావేశంలో అన్నీ చెపుతానని మనోజ్ తెలిపాడు. నేను కొడుతున్నాను అన్నారు కదా.. సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే నిజాలు తెలుస్తాయన్నారు. మా నాన్న దేవుడ.. ఇప్పుడు ఉన్న మా నాన్న .. మా నాన్న కాదు.. నేను అబద్ధాలు ఆడను.. నా గురించి ఎవరిని అయినా ఎంక్వైరీ చేయడం అని చెప్పుకువచ్చాడు మనోజ్.