Moviesబ‌న్నీ అరెస్టు.. రిలీజ్ మ‌ధ్య‌లో ఇంత హైడ్రామా న‌డిచిందా..!

బ‌న్నీ అరెస్టు.. రిలీజ్ మ‌ధ్య‌లో ఇంత హైడ్రామా న‌డిచిందా..!

అనూహ్యంగా ఉరుములేని పిడుగులా అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. ఇవి ఎవ‌రైనా ప్లాన్ చేశారా ? స‌డెన్‌గా అలా జ‌రిగిపోయిందా ? అన్న‌ది ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌దు.. ఎవ్వ‌రికి తెలియ‌దు. అల్లు అర్జున్ విష‌యంలో శుక్ర‌వారం అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. లంచ్ టైంలో ఇంటికి వ‌చ్చిన పోలీసులు అరెస్టు చేస్తున్న‌ట్టు చెప్ప‌గానే అర్జున్‌కే అస‌లు ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. అయితే బ‌న్నీ మాత్రం ధైర్యంగా పోలీసుల వెంట వెళ్లారు. రేవ‌తి మృతి ఘ‌ట‌న‌లో బ‌న్నీ పాత్ర లిమిటెడ్ అన్న‌ది తెలిసిందే.Big twist in Allu Arjun arrest case, victim's husband says he will withdraw  complaint: 'Stampede not his fault' - Hindustan Timesఅందుకే బ‌న్నీ త‌న అరెస్టు గ్ర‌హించి క్వాష్ పిటిష‌న్ వేశారు. అక్క‌డ స్టార్ట్ అయిన‌ డ్రామా అలా ఆలా సాగుతూ పోయింది. ఇక చంచల్ గూడ జైలుకు వెళ్లక తప్పదనే అనుకున్నారు. అనూహ్యంగా బ‌న్నీని జైలుకు త‌ర‌లిస్తోన్న టైంలో హైకోర్టులో మ‌ధ్యంత‌ర బెయిట్ వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌లోనే బ‌న్నీని పోలీస్ స్టేషన్ .. గాంధీ ఆస్పత్రి, నాంపల్లి కోర్టులో తిప్పారు. ఈ కేసులో జైలుకు వెళ్లి ఉంటే మళ్లీ బెయిల్ పిటిషన్ వేసుకుని తెచ్చుకునేవరకూ జైల్లో ఉండాల్సి వచ్చేది.అయితే ఈ కేసులో బ‌న్నీని అరెస్టు చేయాల్సింనంత తీవ్ర‌మైన కేసు అయితే కాద‌న్న చ‌ర్చ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. అటు బ‌న్నీ తండ్రి అల్లు అరవింద్ లాయర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరిగారు. త్రివిక్రమ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. దిల్ రాజు, బన్నీ నిర్మాతలు కూడా వచ్చి అక్క‌డ అండ‌గా ఉన్నారు. ఆరు గంట‌ల హై డ్రామా త‌ర్వాత బ‌న్నీకి బెయిల్ వ‌చ్చింది. అయితే ఆ కాఫీలో త‌ప్పులు ఉన్నాయ‌ని పోలీసులు చెప్ప‌డంతో బ‌న్నీ చివ‌ర‌కు రాత్రంతా జైలులోనే ఉండాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ రోజు ఉద‌యం అరెస్టుతో పెద్ద హైడ్రామాకు తెర‌ప‌డింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news