దువ్వాడ జగన్నాధం(డీజే), గద్దలకొండ గణేష్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇటీవల మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ రైడ్ కు రీమేక్ ఇది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ, కొత్త భామ భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటించారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, సత్య, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టి-సిరీస్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన మిస్టర్ మచ్చన్.. ఆగస్టు 15న భారీ అంచనాల నడుమ విడుదలై నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద రవితేజ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మిస్టర్ బచ్చన్ కు హెవీగా నష్టాలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ వల్ల డైరెక్టర్ హరీష్ శంకర్ జేబుకు సైతం భారీ చిల్లు పడింది.
సినిమాకు వచ్చిన లాస్ కారణంగా హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతలకు అండంగా నిలిచేందుకు ఆయన తన రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీశ్ శంకర్ రెమ్యునరేషన్ రూ.10 కోట్ల కాగా.. రిలీజ్ కు ముందు రూ. 6 కోట్లు తీసుకున్నాడట. బ్యాలెన్స్ అమౌంట్ విడుదల తర్వాత తీసుకోవాలని భావించాడట.
అయితే సినిమా డిజాస్టర్ అవ్వడంతో హరీశ్ శంకర్ తాను తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి ప్రొడ్యూసర్స్ కు రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బ్యాలెన్స్ రూ. 4 కోట్లు కూడా ఇవ్వక్కర్లేదని చెప్పాడట. మొత్తంగా మిస్టర్ బచ్చన్ దెబ్బకు హరీష్ శంకర్ ఆరు కోట్ల రూపాయిలు నష్టపోయాడని బలంగా టాక్ వినిపిస్తోంది.