మిస్టర్ బచ్చన్ ఇటీవల కాలంలో టాలీవుడ్లో అతిపెద్ద డిజాస్టర్. మాస్ మహరాజా రవితేజ ఖాతాలో వరుసగా మరో అట్టర్ ప్లాప్. దీనివల్ల ఈ సినిమా నిర్మాతకు చాలా నష్టం జరిగింది.. ఈ నష్టాలకు తమ వంతు బాధ్యత చేయాలి అని భావించిన దర్శకుడు హరీశంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రు. 6 కోట్లు వెనక్కి ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. నిజంగా ఇది చాలా పెద్ద మాత్రమే దాదాపు హరీష్ రెమ్యూనరేషన్ లో సగం వెనక్కి ఇస్తున్నట్టు లెక్క. ప్రస్తుతం రెండు కోట్లు వెనక్కు ఇచ్చారని మరో నాలుగు కోట్లు తర్వాత చేయబోయే సినిమాకు రెమ్యూనరేషన్‌లో కట్ చేసుకోమని హరీష్‌శంకర్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఓ సినిమా సరిగ్గా ఆడక పోతే దాన్ని దర్శకుడు ఎలా స్పందించాలో హరీష్ శంకర్ కచ్చితంగా అలాగే స్పందించారు.. ఇది మంచి విషయం. హరీష్ శంకర్‌ను కచ్చితంగా అందరూ మెచ్చుకోవాలి.. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద దర్శకులు కూడా హరీష్ శంకర్ ను ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈ సినిమాకు రు. 25 కోట్లు తీసుకున్న రవితేజ ఏం చేస్తారు ? అన్నది కూడా నిన్నటి వరకు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు రవితేజ కూడా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అయితే రవితేజ డబ్బులు… పారితోషకం దగ్గర చాలా కరాకండిగా ఉంటారు అని ఇండస్ట్రీలో పేరు ఉంది.
సినిమా చాలా దారుణమైన డిజాస్టర్ కావడం నిర్మాత.. బయ్యర్లు కోట్లకు కోట్లు నష్టపోవడంతో రవితేజ కూడా నాలుగు కోట్ల బ్యాలెన్స్ వెనక్కు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా దర్శకుడు హీరో కలిపి మొత్తం రు. 6 కోట్లు తగ్గించుకున్నారు. ఇది నైజాం బయ్యర్ నష్టాల భర్తీకి సరిపోతుందని అంటున్నారు. నైజంలో తొమ్మిది కోట్ల మేరకు బయ్యర్ కు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఇది కాక ఏపీ – సీడెడ్ నష్టాలను నిర్మాత సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ పేరు మీద నిర్మాత ఏకంగా 20 కోట్ల వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది.