Moviesఅనంత్ అంబానీ పెళ్లిలో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన రజ‌నీకాంత్.. వీడియో వైర‌ల్‌!

అనంత్ అంబానీ పెళ్లిలో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన రజ‌నీకాంత్.. వీడియో వైర‌ల్‌!

ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ పరిణయం మ‌హోత్వ‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె, తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ మెడ‌లో అనంత్ అంబానీ మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం క‌న్నుల పండుగ‌లా జ‌రిగింది.

పెళ్లికి ముందు బారాత్ ఊరేగింపులో పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అందులో మ‌న సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఒక‌రు. వ‌రుడు అనంత్ అంబానీతో క‌లిసి అమెరికా యాక్ట‌ర్ రాపర్ జాన్ సెనా, రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్ డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టారు. పంచె క‌ట్టులో ఉన్న ర‌జ‌నీకాంత్ ఏడు ప‌దుల వ‌య‌సులో కూడా ఎంతో ఉత్సాహంగా గల్లన్ గుడియా పాట‌కు కాలు క‌ద‌ప‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. సాధార‌ణంగా రజ‌నీకాంత్ సినిమాల్లో త‌ప్పా బ‌ట‌య డ్యాన్స్ చేయ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. అలాంటి ఆయ‌న అంబానీ ఇంట పెళ్లిలో స్టెప్పులు వేయ‌డం చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా, అనంత్ అంబానీ, రాధిక మ‌ర్చింట్ వివాహానికి ర‌జ‌నీకాంత్ తన భార్య లత, కూతుర్తె ఐశ్వర్య, మనవడితో కలిసి వెళ్లారు. ర‌జ‌నీకాంత్ తో స‌హా సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి ఇంకా చాలా మంది తార‌లు అనంత్‌-రాధిక రాయ‌ల్ వెడ్డింగ్ లో సంద‌డి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news