Moviesవావ్: వాట ఏ బంపర్ ఛాన్స్..తల రాతను మార్చుకునే ఆఫర్ అందుకున్న...

వావ్: వాట ఏ బంపర్ ఛాన్స్..తల రాతను మార్చుకునే ఆఫర్ అందుకున్న సమంత..!

నిజంగా ఇది సమంత కు లైఫ్ టర్నింగ్ ఆఫర్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు సమంత తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్న కూడా అస్సలు సైన్ చేయకుండా అభిమానులను హర్ట్ చేసింది అన్న మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ ఛాన్స్ అందుకుందట. దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి .

హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా దారుణాతి దారుణమైన పదాజాలంతో ఆమెను దూషించారు. కారణాలు ఏవైనాప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రొఫెషనల్ లైఫ్ కి లింక్ చేస్తూ ట్రోల్ చేయడం ఫాన్స్ కు నచ్చలేదు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బింబిసారా డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో హీరోయిన్గా త్రిష హీరోగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభరా సినిమాలో వన్ ఆఫ్ ద కీలక పాత్ర కోసం హీరోయిన్ సమంత ను చూస్ చేసుకున్నారట .

దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి ఈ సినిమా లో సమంతది కేవలం గెస్ట్ పాత్ర మాత్రమే నట. కానీ క్యారెక్టర్ పరంగా ఆమెకు రోల్ నచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఓకే చేసిందట . పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తున్న సరే హీరోయిన్ సమంత ఇలా చిన్న పాత్రను ఓకే చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది . చూద్దాం మరి సమంత మెచ్చి ఏరి కోరి చూస్ చేసుకున్న ఈ ఆఫర్ ఆమెకు ఎంతవరకు కలిసి వచ్చేలా చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news