Movies"అలాంటి మగాళ్లు కూడా ఉన్నారు".. రష్మిక మందన్నా సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

“అలాంటి మగాళ్లు కూడా ఉన్నారు”.. రష్మిక మందన్నా సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

రష్మిక మందన్నా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బ్యూటీ . ఆఫ్ కోర్స్ సోషల్ మీడియాలో చాలామంది ఈమెను ట్రోల్ చేస్తూ ఉంటారు . కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోదు ఈ బ్యూటీ. ఎందుకంటే ఆమెకు అలాంటివి పట్టించుకుంటే కెరియర్ సంక నాకి పోతుంది అన్న విషయం కూడా బాగా తెలుసు . పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఒక నెటిజెన్ చేసిన పోస్ట్ ..

ఆ నెటిజన్ చేసిన ట్వీట్ కి రష్మిక మందన్నాను ను ట్యాగ్ చేయడం.. రష్మిక మందన్నా ఆమె పోస్టుకు రిప్లై ఇవ్వడం సంచలనంగా మారింది . రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన సినిమా అనిమల్ . ఈ సినిమాలో రష్మిక ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే. కాగా ఆ సినిమా నుంచి ఒక వీడియోని షేర్ చేస్తూ ..”గుర్తుంచుకోండి మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది ఏదీ లేదు “అంటూ ఆ యూసర్ క్యాప్షన్ ఇచ్చారు .

దీనికి రష్మిక స్పందిస్తూ..” చిన్న కరెక్షన్ స్టుపిడ్ ని నమ్మితే భయంకరం.. చాలామంది మంచి పురుషులు కూడా ఉన్నారు “అంటూ మగవాళ్ళని సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసింది . లవ్ ఎమోజిని కూడా షేర్ చేసింది . ఈ ట్వీట్ బాగా బాగా వైరల్ గా మారింది. రష్మిక మందన్నా ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా రిలీజ్ చేయడానికి మేకర్ సర్వం సిద్ధం చేశారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news