Moviesఈ ప్రభాస్ కి తొందర ఎక్కువే.. కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే...

ఈ ప్రభాస్ కి తొందర ఎక్కువే.. కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే ఏం చేశాడో తెలుసా..?

ప్రభాస్ తెలిసి చేస్తాడో ..? తెలియక చేస్తాడో ..? తెలియదు కానీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభాస్ కి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి . ప్రభాస్ పెళ్లి విషయంలో ఆలస్యం చేయడం ఆయన కెరీర్ కి అలాగే ఆయన పర్సనల్ లైఫ్ కి ఎంత నెగిటివ్ గా మారింది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన తన పెళ్లిని కూడా వాడుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే కల్ కి సినిమా జూన్ 27వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

ఈ మూమెంట్ లోనే ప్రభాస్ యూరప్ ట్రిప్ వేయడం సంచలనంగా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రభాస్ యూరప్ ట్రిప్ కి వెళ్తున్నాడు ..నిజానికి ప్రభాస్ తన సినిమాల రిలీజ్ టైం లో ఇండియాలో ఉండడు .. ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటాడు .. అయితే సాధారణంగా ఆయన ఒకటి రెండు రోజులు ముందు సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లో ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగు రోజులు ముందే ప్రభాస్ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

ప్రభాస్ యూరప్ ఫారిన్ ట్రిప్ కి వెళ్తున్నాడట . అంతేకాదు కల్కి సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇక కనిపించడట . ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రభాస్ ఇంత ముందుగానే తన ఫారిన్ ట్రిప్ ను ప్లాన్ చేసుకున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ప్రభాస్ అంచనాలు ఈ సినిమా విషయంలో ఏ మేరా సక్సెస్ అవుతాయో..? సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news