Moviesసడెన్ గా బన్నీ ఇంటికి వెళ్లి అలా చేసిన స్టార్ హీరోయిన్..ఎక్స్...

సడెన్ గా బన్నీ ఇంటికి వెళ్లి అలా చేసిన స్టార్ హీరోయిన్..ఎక్స్ క్లూజివ్ పిక్స్ వైరల్..!!

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎలాంటి టాప్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అయితే చాలా పకడ్బందీగా ప్లాండ్ గా తన లైఫ్ను ముందుకు తీసుకెళుతున్న అల్లు అర్జున్ హీరోయిన్స్ కి మోస్ట్ ఫేవరెట్ హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే .

కేవలం మన ఇండస్ట్రీ హీరోయిన్స్ కే కాదు పక్క భాష ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ కి కూడా అల్లు అర్జున్ అంటే మహా మహా ఇష్టం. రీసెంట్గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి సర్ప్రైజ్ చేసింది ఒక స్టార్ హీరోయిన్ . ఆమె మరెవరో కాదు కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. క్రాక్ -వీరసింహారెడ్డి – యశోద వంటి చిత్రాలలో విలన్ గా నటించి తెలుగులోనూ హ్యూజ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది .. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నిచోలై సచ్ దేవ్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకోనుంది.

రీసెంట్గా నిశ్చితార్ధం కూడా జరిగింది .. జూలై లో పెళ్లి ఘనంగా జరగబోతుంది.. ఇప్పటికే పెళ్లి పనులను ప్రారంభించేసింది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా బన్నీ ఇంటికి వెళ్లి మరి తన కాబోయే భర్తతో ఇన్విటేషన్ ఇచ్చి సందడి చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ -నిచోలై సచ్ దేవ్.. బన్నీ ఇంటికి వెళ్లి మరీ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు . అక్కడ కాసేపు సందడి చేశారు . వాళ్ళు సరదాగా దిగిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . టాలీవుడ్ స్టార్స్ లో బన్నీతో పాటు హీరో రవితేజ దర్శకుడు హరి శంకర్. ప్రశాంత్ వర్మ – సమంత – వంశీ పైడిపల్లి – గోపీచంద్ మల్లినేని కూడా వెడ్డింగ్ కి ఆహ్వానించారు వరలక్ష్మి శరత్ కుమార్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news