Newsమరో బిగ్ మల్టీ స్టారర్ మూవీని ఓకే చేసిన ఎన్టీఆర్ ..ఈసారి...

మరో బిగ్ మల్టీ స్టారర్ మూవీని ఓకే చేసిన ఎన్టీఆర్ ..ఈసారి ఆ లక్కీ ఛాన్స్ అందుకున్న హీరో ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొకసారి ఎన్టీఆర్ తన కెరీర్ లోనే బిగ్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడు .

కాగా నిన్న మొన్నటి వరకు ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే హీరో అని అంతా అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంటూ.. ఈ సినిమాలో మరొక పాన్ ఇండియా హీరోని యాడ్ చేశారట. ఇదే న్యూస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతుంది . ప్రశాంత్ నీల్ కి సంబంధించిన సినిమాకి రిలేటెడ్ డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడు అన్న విషయం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారట . ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుందట . దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అంతేకాదు ఈ సినిమాలో విలన్ రోల్ లో నెగిటివ్ షేడ్స్ పాత్రలో బాబి డియోల్ కూడా నటించబోతున్నారట. మొత్తానికి భారీ స్థాయిలో కాస్ట్ అండ్ క్రూ ని పెట్టుకొని సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు ప్రశాంత్ నీల్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news