Moviesచాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి సైన్ చేసిన నిత్యామీనన్..ఆ లక్కి...

చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి సైన్ చేసిన నిత్యామీనన్..ఆ లక్కి హీరో ఎవరంటే..?

నిత్యామీనన్ ..పేరుకు మలయాళ బ్యూటీనే.. కానీ తెలుగులో బాగా అవకాశాలు దక్కించుకుంది.. అలా ఇలా కాదు ఏకంగా టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. మరీ ముఖ్యంగా నిత్యామీనన్ నటించిన సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో మనకు తెలిసిందే . నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చూస్ చేసుకుని కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టింది .

మరీ ముఖ్యంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కథలను బాగా లైక్ చేస్తూ బాగా నటిస్తూ వచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ . కాగా ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ తెలుగులో సినిమాల్లో కనిపించలేదు . ఒక టాప్ డైరెక్టర్ ఆమెను చీట్ చేశాడు అని ఆ కారణంగానే తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది అని తెగ ప్రచారం జరిగింది . సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అమ్మడు తెలుగు సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యామీనన్ – నితిన్ జంట ఎంత సూపర్ డూపర్ క్రేజీ కాంబోనొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అయింది . ఇష్క్ – గుండెజారి గల్లంతయ్యిందే.. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు వీళ్ళ కాంబోలో మరో సినిమా రాబోతుంది . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ “తమ్ముడు” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ లయ కూడా కీలకపాత్రలో కనిపించబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో నిత్యామీనన్ కనిపించబోతుందట . నితిన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఈ హీరో మూవీను యాక్సెప్ట్ చేసిందట. దీంతో ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news