Moviesకల్కి 2898AD మూవీ ట్రైలర్ రివ్యూ: అన్ని బాగున్న కథకి ఆ...

కల్కి 2898AD మూవీ ట్రైలర్ రివ్యూ: అన్ని బాగున్న కథకి ఆ ఒక్కటే పెద్ద మచ్చగా మారిపోయిందే.. సినిమాకి భారీ బొక్క తప్పదా..?

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వలో ఈ మూవీ తెరకెక్కింది . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు . కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . మొదటి నుంచి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా రెబెల్ అభిమానులకు ట్రైలర్ ఫుల్ సాటిస్ఫై చేసింది . కడుపునిండా అన్నం పెట్టిన అంత ఫీలింగ్ కలుగజేసింది . అయితే ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఎక్కడ ఈ సినిమా తెలుగు జనాలకు నచ్చే విధంగా ఉండకపోవడం గమనార్హం . ఒక హాలీవుడ్ రేంజ్ స్థాయిలో నాగ్ అశ్వీన్ సినిమాను తెరకెక్కించారు . అంతా కూడా క్లారిటీగా లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరి ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ ఒక్కడే స్టార్ హీరోనా..? మిగతా వాళ్ళు కూడా హీరోలేనా..? అన్న రేంజ్ లో అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చాడు నాగ్ అశ్వీన్. అంతేకాదు స్టోరీ కూడా ముసలి వాళ్లకి చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కల్కి సినిమాపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది . ప్రభాస్ అన్ని హాలీవుడ్ రేంజ్ సినిమాలను చేసుకుంటున్నాడు . కాస్త తెలుగు డైరెక్టర్ తెలుగు జనాలకు నచ్చే విధంగా ఉండే సినిమాలు చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు .

సినిమా మొత్తానికి కథ హైలెట్ గా మారబోతుంది అని అర్థమవుతుంది ..అయితే అదే కధ సినిమాకి తెలుగులో నెగిటివ్ గా మారబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఒకటికి నాలుగు సార్లు చూస్తే గాని ట్రైలర్ అర్థం కాని పరిస్థితి. మరి అలాంటిది థియేటర్స్ లో జనాలకు ఈ సినిమా ఎంతవరకు నచ్చుతుంది అనేది ఆ దేవుడికే తెలియాలి ..చూద్దాం జూన్ 27 ఏం జరగబోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news